ప్రస్తుతం ఉన్న బంగారం, వెండి ధరలలో కొనాలి అంటే సామాన్యులకు సైతం చుక్కలు చూపించేలా ధరలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బంగారం, ధరలు పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితిలో ముఖ్యమైన కారణం. డాలర్ విలువ గణనీయంగా తగ్గడం వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయి. వీటికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇటీవల వడ్డీ రేట్లు తగ్గించడంతో  అమెరికా ట్రెజరీ బ్రాండ్ల విలువ కూడా పడిపోయింది. దీంతో అక్కడ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సైతం బంగారం వైపుకి మళ్లిస్తున్నారు. దీని ఫలితంగానే బంగారం డిమాండ్ కూడా పెరుగుతోందని నిపుణులు తెలుపుతున్నారు.


అలాగే కొన్ని దేశాలు బంగారాన్ని నిల్వ ఉంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా భారీ బంగారం కొనుగోలు చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. దీనివల్ల కూడా ధరలు భారీగానే పెరగడానికి కారణమవుతున్నాయంటూ నిపుణులు వెల్లడిస్తున్నారు. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1.25 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతో సామాన్యులు కూడా బంగారం కొనాలి అంటే భయపడుతున్నారు. అయితే భవిష్యత్తులో కూడా బంగారం ధరలు పెరుగుతాయా ?తగ్గుతాయా? అనే సందేహం అందరిలో ఉండవచ్చు.


కానీ నిపుణులు తెలుపుతున్న అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో కూడా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఎక్కువగానే ఉన్నదంటూ తెలియజేస్తున్నారు. అలాగే కిలో వెండి ధర విషయానికి వస్తే రూ. 1.43 లక్షల రూపాయలకు పెరిగిపోయింది. పారిశ్రామిక డిమాండ్ పెరగడం వల్లే అటు వెండి ధరలలో కూడా వేగంగా మార్పులు వస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా విధిస్తున్న సుంకల వల్ల కూడా స్టాక్ మార్కెట్ పైన ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అమెరికాకు ఆర్థిక వ్యవస్థలు ఒడిదుడుకులు  ఏర్పడే అవకాశం ఉంటుందంటూ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. దీని ద్వారా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మరింత వేగంగా బంగారం వైపు మళ్లించే అవకాశం ఉంటుంది. కనుక  బంగారం ధరలు మరింత పెరుగుతాయని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: