బీహార్ ఎన్నికలు తర్వాత కర్ణాటక రాజకీయాలలో ఈ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి డిప్యూటీ సీఎం, డీకే శివకుమార్ విలేకరులతో మాట్లాడారు.. అయితే ఈ విషయం పైన ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదని ఇది ముఖ్యమంత్రికి, పార్టీకి సంబంధించిన విషయమని తెలియజేశారు. తాను పార్టీ కోసం మాత్రమే పని చేస్తున్నానని తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో మార్పులు ఉంటాయని ఎప్పటి నుంచొ ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రితో సహా అనేకమంది ఇతర నాయకులకు 2.5 సంవత్సరాల తర్వాత న్యాయకత్వం మార్చే అవకాశం ఉన్నట్లు వినిపిస్తున్నాయి.
అలాగే మరొకవైపు కర్ణాటక మంత్రివర్గం మహిళలకు ఒక గుడ్ న్యూస్ తెలియజేశారు. అదేమిటంటే మహిళలకు నెలకు ఒక రోజు వేతనంతో కూడిన (నెలసరి సెలవుని) ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ విధానం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రైవేటు కంపెనీలకు సంబంధించి పనిచేసే మహిళలందరికీ కూడా ఇది కచ్చితంగా వర్తిస్తుంది అంటూ ఆర్డర్లు పాస్ చేసింది కర్ణాటక ప్రభుత్వం. దీనివల్ల ఏడాదిలో మొత్తం 12 రోజులు సెలవులు తీసుకోవచ్చు మహిళలు. మహిళల యొక్క ఆరోగ్యం, శ్రేయస్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలుపుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి