
ఇటీవల సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ప్యాలెస్ మరమ్మత్తుల కోసం ఏకంగా రూ .కోటి 21 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేశారని అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి రెండు నెలల వ్యవధిలోనే కరకట్ట ప్యాలెస్ కి సంబంధించి మరమ్మత్తుల ఖర్చులకోసం రూ .95 లక్షల రూపాయలకు సంబంధించి జీవాలు జారీ చేసినట్లు వైసీపీ నేతలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో రూ .20 లక్షల రూపాయలు మరుగుదొడ్లు, నీటి సరఫరా మరమ్మత్తులకు, అలాగే మరో రూ .16 లక్షల రూపాయలు వంటశాల సదుపాయం కోసం, మరో రూ.20 లక్షలు నివాసం చుట్టూ చెదల నివారణ కోసం ఉపయోగించినట్లు వినిపిస్తున్నాయి. ఇతరత్రా వాటి కోసం ఖర్చు చేసినట్లు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు కోట్ల రూపాయలు తన ప్యాలస్ కోసం ఖర్చులు చేశారని ప్రతిపక్ష నేతలు తెలియజేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు కొన్నిటిని వైరల్ చేస్తున్నారు వైసిపి నేతలు. అయితే గతంలో కూడా మాజీ సీఎం జగన్ తన నివాసానికి ఖర్చు చేస్తున్న సమయంలో టిడిపి అనుకూల మీడియా పత్రికలు జగన్ తన నివాసానికి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చూపించారు. ఇప్పుడు చంద్రబాబు నివాస విషయాన్ని వైసిపి నేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ఢిల్లీలో చంద్రబాబు నివాసానికి కూడా అక్కడ సౌకర్యాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలియజేస్తున్నారు . దీంతో ప్రతిపక్ష నేతలు సైతం ఈ విషయం పైన చంద్రబాబు ను ఏకిపారేస్తున్నారు.