రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందనే దానిపైన ఉత్కంఠ పెరిగింది.. ముఖ్యంగా  నియోజకవర్గంలో 2023 ఎలక్షన్స్ లో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. కానీ ఆయన గుండెపోటుతో మరణించడంతో అక్కడ ఉపయోగించి అనివార్యమైంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ గోపీనాథ్ భార్య సునితను బరిలో ఉంచింది. ఇక కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చింది. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇదిలా నడుస్తున్న సమయంలో సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే నవీన్ యాదవ్ ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్లిపోతారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

మరి ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్లడం ఏంటి ఆ వివరాలు చూద్దాం. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది . కాంగ్రెస్ ఎన్నికల ముందు కొన్ని హామీలను మరచి పోయింది దీంతో ప్రజలు విసుగు చెందారు. 2028 ఎలక్షన్స్ సమయం వరకు బీఆర్ఎస్ కి మంచి ఊపు వస్తుందని, ఈ టైంలోనే చాలామంది కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరుతారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ సమయంలోనే నవీన్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ లోకి  వెళ్లిపోతారని అంటున్నారు.

 అయితే కాంగ్రెస్ లో ఉండే చాలామంది ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గం లో తగినంత అభివృద్ధి చేసుకోకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలుస్తోంది. వచ్చే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలవడం కష్టమని వారికి ఇప్పటికే అర్థమయిపోయిందని కాబట్టి మళ్లీ బీఆర్ఎస్ కే ఛాన్స్ ఉంటుందని ఆ పార్టీలోకి వీళ్లంతా జంప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి 2028 వరకు ఎలాంటి పరిణామాలు వస్తాయనేది ముందు తెలియబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: