చంద్రబాబు నాయుడు.. ఈయన పాలన చాలా డిఫరెంట్ గా ఉంటుంది.. అయితే చంద్రబాబు నాయుడు అప్పటికప్పుడు రిజల్ట్ వచ్చి ప్రజలు ఆనందపడే పనులు ఏమీ చేయడు.. ఫ్యూచర్ లో ప్రజలకు ఉపయోగపడి భవిష్యత్ తరాలు బ్రతికే విధంగా అభివృద్ధి పనులు చేస్తూ ఉంటాడు. ఈరోజు హైదరాబాద్ అంతా డెవలప్ అయి, అంత మందికి ఉపాధి కలుగుతుంది అంటే దానికి ప్రధాన కారకుడు చంద్రబాబు కూడా అని చెప్పవచ్చు. ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అప్పట్లోనే ఐటీ కంపెనీలను తీసుకువచ్చి హైదరాబాదులో స్థాపించారు. ప్రస్తుతం ఆ ఐటి కంపెనీల వల్ల లక్షలాదిమంది యువత డైరెక్ట్ గా,  ఇండైరెక్టుగా ఉపాధి పొందుతున్నారు. ఆ విధంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అమరావతిని రాజధాని చేస్తున్నారు కాబట్టి అక్కడ అన్ని కంపెనీలను తీసుకువచ్చి పెట్టుబడులు పెట్టిస్తే భవిష్యత్ తరాలకు మంచి ఉపాధి దొరికి, రాష్ట్రం డెవలప్ అవుతుందనేది ఆయన ఆలోచన..

 ఆ విధంగానే వరుసగా టూర్స్ వెళుతూ పెట్టుబడుల కోసం వెతుకుతున్నారు. త్వరలో పెట్టుబడి దారుల సదస్సులో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని వారు ఆశిస్తున్నారు. ఇందులో అమరావతి రాజధాని పెట్టుబడులెంత.. విశాఖపట్నంకు ఎంత.. రాయలసీమకు ఎంత అనేది చర్చ నడుస్తోంది.. ఏది ఏమైనప్పటికీ పెట్టుబడులు పెట్టడం అనేదే ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది.  వ్యాపారాలు వస్తే ఆటోమేటిగ్ గా ఇక్కడున్న వారికి ఉపాధి దొరుకుతుంది. అంతేకాకుండా దాని చుట్టుపక్కల భూముల రేట్లు పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా సాగుతుంది. చంద్రబాబు అప్పట్లో సిఎంగా ఉన్నప్పుడు హైదరాబాదులో 4 లక్షలు ఉన్నటువంటి ల్యాండ్ రేట్, ఇప్పుడు 150 కోట్లు పలుకుతోంది. దానికి కారణం పెట్టుబడులు, వ్యాపారాలు రావడమే. హైదరాబాదును ఏవిధంగా డెవలప్ చేశారో ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిని విశాఖపట్నంలా డెవలప్ చేయాలని చంద్రబాబు, లోకేష్ ఇతర మంత్రివర్గం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆ దిశగానే విదేశాల్లో తిరుగుతూ పెద్దపెద్ద బిజినెస్ మ్యాన్లతో మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలుకుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు డెవలప్ కావాలి అంటే విశాఖపట్నం మాత్రమే మంచి ప్లేస్ అని తెలుస్తోంది. అమరావతిలో పెట్టుబడులు పెట్టిస్తే మాత్రం అక్కడ డెవలప్ అయ్యేసరికి ఇంకా దశాబ్దకాలం పడుతుంది. ఎందుకంటే అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి.అవన్నీ పూర్తిగా క్లియర్ అయితే కానీ అక్కడ డెవలప్మెంట్ పనులు పూర్తికావు. విశాఖపట్నం ఆల్రెడీ కాస్త డెవలప్ ఉన్న పట్టణం కాబట్టి అక్కడ పెట్టుబడులు పెట్టిస్తే తొందరగా ప్రజలకు ఉపాధి దొరుకుతుందని సీనియర్ వ్యాపారవేత్తలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: