ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉంటుందో అందరికీ తెలుసు. కానీ ఈసారి బీఆర్ఎస్ పార్టీ దానిని అత్యంత సీరియస్‌గా తీసుకుంది. “సోషల్ మీడియా అంటేనే మాస్ శక్తి” అనే నమ్మకంతో ముందుకెళ్తున్న బీఆర్ఎస్ నాయకత్వం, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఆన్‌లైన్ ప్రచారాన్ని అగ్రస్థానంలో నిలిపింది. కేటీఆర్ ముందుండి సోషల్ మీడియా సైన్యాన్ని గట్టిగా తయారు చేసిన ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ డిజిటల్ సైన్యం ఫుల్ యాక్షన్‌లో! .. ఫేస్‌బుక్‌, ఎక్స్‌ (ట్విట్టర్‌), ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ – ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పోస్టులే. పార్టీ సోషల్ మీడియా టీమ్‌ పకడ్బందీగా వ్యూహాలు వేసి, ప్రతి రోజూ వైరల్ అయ్యే పాయింట్లను ప్లాన్‌ చేస్తోంది. ఒక్క వీడియో, ఒక్క ట్వీట్ కూడా ప్లాన్‌ లేకుండా బయటకు రాదు. సర్వే రిపోర్టులను హైలైట్ చేస్తూ “జూబ్లీహిల్స్‌లో గెలుపు మనదే” అనే నినాదాన్ని బలంగా మోస్తున్నారు.


భారీ బడ్జెట్‌తో బీఆర్ఎస్ ప్రభావం .. అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. వందలాది డిజిటల్ కార్యకర్తలను నియమించి, వారికోసం ప్రత్యేక వేతనాలు కూడా కేటాయించింది. సోషల్ మీడియా పోస్టులు, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగులు, వీడియో క్లిప్స్  - all professionally managed. ఈ ఆర్థిక సామర్థ్యం బీఆర్ఎస్‌ను ఇతర పార్టీలకంటే ఒక అడుగు ముందుకు నెడుతోంది. కాంగ్రెస్ డిజిటల్ డివిజన్ బలహీనత స్పష్టంగా! .. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం సోషల్ మీడియా వ్యూహంలో వెనుకబడింది. గతంలో బీఆర్ఎస్‌పై టీడీపీ సోషల్ మీడియా సపోర్ట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ శక్తి లేదు. రేవంత్ రెడ్డి మీద ఉన్న మొదటి ఉత్సాహం కూడా తగ్గిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ “సునీల్ కనుగోలు టీమ్” మీద ఆధారపడుతోంది కానీ ఆ టీమ్‌లో రాజ
కీయ అనుభవం తక్కువ. బుక్కిష్ నాలెడ్జ్ ఎక్కువగా ఉన్నా, మాస్ కనెక్ట్‌ లేకపోవడం వల్ల పోస్టులు వైరల్ కావడమే కాదు, ప్రజల దగ్గర చేరడం కూడా కష్టమవుతోంది.


సోషల్ మీడియా హైప్ వర్సెస్ గ్రౌండ్ రియాలిటీ .. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో హవా క్రియేట్ చేస్తోంది కానీ అది జూబ్లీహిల్స్ ఓటర్లను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో అనుమానమే. జూబ్లీహిల్స్ ఒక మాస్ ఏరియా. అక్కడ సోషల్ మీడియా కంటే గ్రౌండ్ లెవల్ ప్రచారం ఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఆన్‌లైన్‌లో హైప్‌ క్రియేట్‌ అవ్వడం ఒక విషయం, కానీ బూత్‌ స్థాయిలో ఓటర్‌ దగ్గరికి చేరడం మరో విషయం. ఇప్పటికైతే సోషల్ మీడియా రేసులో బీఆర్ఎస్ స్పష్టంగా ముందంజలో ఉంది. కాంగ్రెస్ మాత్రం డిజిటల్ ఫ్రంట్‌లో ఆగిపోయినట్టే. కానీ చివరికి ఓటు వేయేది ఆన్‌లైన్‌లో కాదు – బూత్‌లో! కాబట్టి సోషల్ మీడియా హవా ఫలితాల్లోకి మారుతుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: