ఇండియాలో నవంబర్ 11వ తేదీన ఇండియన్ మార్కెట్లోకి యమహా మొదటి ఎలక్ట్రిక్ బైక్ ని ప్రవేశపెట్టింది. దీంతోపాటు యమహా FZ RAVE, యమహా XSR155 మోటార్ సైకిలను కూడా విడుదల చేశారు. అయితే 2026 నాటికి ఇండియాలోని 10 కొత్త మోడల్స్ ను విడుదల చేయబోతున్నట్లు యమహా కంపెనీ ప్రకటించి మార్కెట్లో ఒక సంచలనం సృష్టిస్తోంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఉండబోతున్నట్లు తెలియజేశారు.
1).yamaha FZ-RAVE:
ఈ బైక్ ఆధునిక డిజైన్ తో తయారు చేయబడింది ఈ బైక్ ధర రూ.1,17,218(ఎక్స్ షోరూమ్) ధరతో లభిస్తుంది. ఈ బైక్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్,149 CC ఎయిర్ కూల్ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు, 5 స్పీడ్ గేర్ బాక్స్ తో కలదు. అలాగే సేఫ్టీ కోసం సింగిల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేక్ సిస్టం కలదు. అలాగే బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేకులు కలవు. మరి కొన్ని అవినాతన ఫీచర్స్ కలవు.
2).yamaha XSR 155:
ఈ బైక్ రైడర్ ల కోసం ప్రత్యేకించి తయారు చేశారు. దీని ధర రూ.1,50 లక్షలు ఉంది. రౌండ్ ఎల్ఈడి ల్యాంప్, 155CC సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు. సేఫ్టీ కోసం డ్యూయల్ యాంటీ లాక్ బ్రేక్ సిస్టం కలదు. అలాగే అధునాతన ఫీచర్లు కూడా ఈ బైకుల ఉన్నాయట. ఈ బైక్ సైతం రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 , మరి కొన్ని బైక్స్కి గట్టి పోటీ ఉంటుందని తెలుపుతున్నారు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి