ఈ తప్పుడు దరఖాస్తులన్నిటిని కేంద్ర ప్రభుత్వం తొలగించే పనిలో ఉన్నదని దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు పీఎం కిసాన్ యోజనలో స్థిరపడి ఉన్న మార్గదర్శకాలను ఉల్లంఘించి వారి పేర్లను నమోదు చేసుకున్నారని.. అందుకే దేశవ్యాప్తంగా ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు పిఎం కిసాన్ నిధులను విడుదల చేయమంటూ కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 1,2019 తర్వాత భూమిని కొనుగోలు చేసి ప్రయోజనాలు పొందుతున్న వారు ఉన్నారని, అలాగే ఒకే కుటుంబంలో (భర్త, భార్య, మైనర్ పిల్లలు కూడా ఉన్నారని) ఇలా ఒకే కుటుంబంలోనే లబ్ధిదారులు చాలామంది ఉన్నట్లుగా పరిగణించామని తెలిపారు.
అందుకే కేంద్ర ప్రభుత్వం క్లీన్ ఆఫ్ డ్రైవ్ ప్రారంభించామని ఇప్పటివరకు 35,44 లక్షల రూపాయలకు పైగా పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా నుండి తొలగించినట్లుగా తెలిపారు. ఈ దర్యాప్తుకు కారణం వల్ల 21వ విడత ఆలస్యం అవుతొందని తెలుపుతున్నారు. అయితే ఈ జాబితా నుంచి పేర్లు తొలగించడం తాత్కాలికమే శాశ్వతం కాదంటూ తెలిపారు. కేవలం అనర్హుల పేర్లను మాత్రమే తొలగించి అర్హులైన వారికి సంబంధించి పత్రాలను సమర్పిస్తే వారి పేర్లను జాబితాలో చేరుస్తామంటూ తెలిపారు.
అర్హుల జాబితాలో మీ పేరు కనిపించకపోతే:
ముఖ్యంగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. అలాగే బ్యాంకు ఖాతా ఆధార్ లింక్ అయిందో లేదో చూసుకోవాలి.
పీఎం కిసాన్ పోర్టల్ లో ఈ కేవైసీ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటిపి వస్తుంది. దానిని నమోదు చేసి వెరిఫై చేస్తే లిస్టులో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. ఒకవేళ అనర్హులుగా ఉంటే .. అందుకు సంబంధించి పత్రాలను అప్లోడ్ చేసి తొలగించుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి