ఇటీవల బీహార్ ఎన్నికల ఫలితాలలో చాలామంది నేతలు సంచలనాలు సృష్టించారు. ముఖ్యంగా మైథిలీ ఠాకూర్ పేరు ఎక్కువగా బీహార్ రాష్ట్రంలో వినిపిస్తోంది. దేశంలో కూడా ఈమె ఒక సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. 50% ముస్లింల ఓటు బ్యాంకు ఉన్న ఆలీనగర్ నియోజకవర్గం నుంచి ధైర్యంగా పోటీ చేసి మరి అతి చిన్న వయసులో (25) ఎమ్మెల్యేగా ఎంపిక అయింది. మైథిలీ ఠాకూర్ భారతీయ గాయని, రచయిత్రి మరియు ప్రముఖ రాజకీయ వేత్తగా పేరు సంపాదించింది. ఇమే బీహార్లోని మధుబని జిల్లాలో 2000 సంవత్సరం జూలై 25న జన్మించారు.


ఈమె తల్లిదండ్రులు రమేష్ ఠాకూర్, తల్లి భారతీ ఠాకూర్ వీరిద్దరూ కూడా మ్యూజిక్ టీచర్ లే. మైథిలీ ఠాకూర్ తండ్రి, తాత ఫోక్ మరియు హిందుస్థానీలో క్లాసికల్ మ్యూజిక్ లో శిక్షణలు ఇచ్చేవారట. 2016లో ఐజీఎస్ యంగ్ సింగింగ్ స్టార్ పోటీలో విజేతగా నిలిచింది మైథిలీ. 2017లో రైసింగ్ స్టార్ సీజన్ మొదటి భాగంలో ఫైనలిస్ట్ గా పాల్గొని ఓం నమఃశివాయ పాటతో బాగా పేరు సంపాదించింది. ఇమే హిందీ, భోజ్ పూరి , అవధి, మగహి వంటి భాషలలో ప్రదర్శించి పేరు సంపాదించింది.


ఇమే యూట్యూబ్ ఛానల్లో 10 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఏడాది ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికలలో ఆలీనగర్ నుంచి పోటీ చేసి 25 ఏళ్ల వయసులోనే బీహార్లో అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచింది. ఈమె ఆర్జెడి అభ్యర్థి బినోద్ మిశ్రాను 11 వేల ఓట్లకు పైగా మెజారిటీతో ఓడించింది. అయితే ఈ విజయం ఆలీనగర్ లోని బిజెపి మొట్టమొదటి విజయమని తెలుస్తోంది. అంతేకాకుండా ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా పోటీ చేసి మొదటిసారిగానే ఎమ్మెల్యేగా అయ్యింది మైథిలీ. ఈ విజయం పై మైథిలి మాట్లాడుతూ.. ఇది నా విజయం కాదు, ప్రజల విజయమని.. మహిళల అభివృద్ధి మోదీ, నితీష్ కుమార్ పాలిసి చూసి ప్రజలు మద్దతు ఇచ్చారని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: