ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంటే తెలియని వారు ఉండరు.. అయితే ఆయన ఇదివరకు పలు పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసి, పార్టీల గెలుపు కోసం ఆలోచనలు చేస్తూ  ముందుకు వెళ్లేవారు. అలాంటి పీకే జన్ సూరజ్ పార్టీ స్థాపించి బీహార్ ఎన్నికల్లోగెలిచి సంచలనం సృష్టించాలనుకున్నారు. కానీ అక్కడ పోటీ చేసిన స్థానాల్లో ఎక్కడా కూడా గెలవకపోవడంతో బొక్క బోర్లా పడ్డాడు. అలాంటి పీకే తాజాగా ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ మధ్యకాలంలో ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కానీ అదృశ్య చేతుల ప్రమేయం ఉంటుందని నాకు అనిపిస్తోందన్నారు.. ఆ శక్తులు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనే విషయాలపై క్లారిటీ లేదని పీకే వ్యాఖ్యానించారు. అయితే తాజాగా జాతీయ మీడియా సమావేశంలో ఈయన ఇలా మాట్లాడడంతో చాలా వైరల్ అవుతుంది. 

జన్ సూరజ్ పార్టీ నుంచి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్థానాల్లో పోటీ చేశారు. కానీ ఒక్క స్థానంలో కూడా గెలవకపోగా డిపాజిట్ కూడా రాలేదు. కానీ ఓటు బ్యాంకు మాత్రం 3.35 శాతం వచ్చింది. దీంతో చాలా ఆందోళన చెందుతున్న పీకే ఎన్నికల సమయంలో అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయని అన్నారు.కానీ ఆ శక్తులు ఎవరో అంతు చిక్కడం లేదన్నారు.. అందరికీ ఉన్నట్టుగానే నాకు కూడా ఈవీఎంలపై కాస్త అనుమానం ఉందని తెలియజేశారు.

కానీ వాటిని నిరూపించేందుకు ఆధారాలు లేవని అన్నారు. బీహార్లో ముక్కూ మొహం తెలియని పార్టీ కూడా విజయం దక్కించుకుందని, వాటి సింబల్స్ కూడా ప్రజలకు పెద్దగా తెలియవని తెలియజేశారు.. మేము పార్టీ పరంగా చాలా బాగా పనిచేస్తాం. ప్రజల్లో నుంచి మాకు మంచి మద్దతు లభించింది. కనీసం 50 స్థానాలైనా దక్కించుకుంటామని భావించాం. కానీ అనూహ్యంగా రిజల్ట్ తారుమారయ్యిందన్నారు. ఈ విధంగా పీకే తనలో ఉన్న అనుమానాలను బయట పెట్టడంతో సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు హైలైట్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: