అయితే వారందరూ కూడా కోరుకునేది కేవలం జగన్ గుర్తింపు పలకరింపు మాత్రమే. రాజశేఖర్ రెడ్డి మరణాంతరం జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆయన ఉన్నతి కోసమే పనిచేసిన చాలామంది కార్యకర్తలు నేతలు ఉన్నారు. కానీ వారందరికీ సరైన గుర్తింపు రాలేదని ఆవేదనలు ఉన్నారు. వైసిపి పార్టీ 2019 లో అధికారంలోకి వచ్చినప్పటికీ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను పట్టించుకోలేదనే వాదన ఎక్కువగా వినిపించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వైసిపి పార్టీ వెంట నడిచే వాళ్లతో పాటు, ఉండే వాళ్లను కూడా నిలబెట్టుకోవడం అనేది వైయస్ జగన్ కు ఇది పరీక్ష సమయం అని చెప్పవచ్చు.
2029 ఎన్నికలలో మళ్లీ అధికారమే లక్ష్యంగా జగన్ పెట్టుకొని మరి పాదయాత్రలను చేయబోతున్నారు. 2029 ఎన్నికలలో గెలవాలి అంటే ఇప్పటినుంచే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కలుపుకునే బాధ్యత కూడా జగన్ వైపే ఉంది. పార్టీ కోసం నిలబడిన వారిని క్షేత్రస్థాయిలో గుర్తించాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నది. కూటమి ప్రభుత్వానికి భయపడి చాలామంది మాట్లాడకపోయినప్పటికీ ఇటీవల కాలంలో వైసీపీ పార్టీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇలాంటి సమయంలో నిజంగా పార్టీ కోసం పనిచేసే వారిని పిలిచి ఆదరించాల్సిన ,ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతిలోనే ఉన్నది.
క్షేత్రస్థాయిలోకి దిగి మరి జగన్ ప్రజలలోకి వెళ్లి నష్టపోయిన కార్యకర్తలకు ధైర్యం చెప్పడమే కాకుండా అన్ని విధాలుగా ఆదుకుంటే వైసిపి పార్టీ కూడా మరింత బలపడుతుంది. ముఖ్యంగా వైసిపి పార్టీలో నిజాయితీగా ఉండే వారందరినీ కూడా జగన్ అక్కున చేర్చుకోవాలి. వైసిపి పార్టీ తమది అని భావించే వారందరికీ కూడా కీలకమైన బాధ్యతలు అప్పగిస్తే రాబోయే రోజుల్లో వైసిపి పార్టీ మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది. ఈ భారం అంతా కూడా జగన్ మీదే ఉన్నదంటూ వైసీపీ నేతలు ,కార్యకర్తలు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి