ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే ఎక్కడ కనీవినీ ఎరుగని రీతిలో ఈ రాజధాని ఉండబోతుందంటూ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు కూటమినేతలు కూడా పదేపదే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దడానికి  అక్కడ 29 వేల మంది రైతులు తమ భూమిని త్యాగం చేశారని వారిని ప్రశంసిస్తూ ఉంటారు చంద్రబాబు . అయితే రాజధానిని నిర్మించే పనిలో వేగంగా ముందుకు వెళ్తున్నారు తప్ప.. భూములు ఇచ్చిన రైతులను, వారి సమస్యలను మాత్రం పట్టించుకోలేదని రైతులు ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు .



రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి రాజధానిగా బాగుంటుందని చంద్రబాబు రైతుల ముందు ప్రతిపాదన తీసుకువచ్చినప్పుడు వారందరూ కూడా సహకరించి మరీ భూములు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ సీఎం అయిన తర్వాత కూడా ఇంకా రైతుల సమస్యలు ఉన్నాయనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గడిచిన రెండు రోజుల క్రితం అమరావతి రైతులతో సమావేశమైన చంద్రబాబు వారి సమస్యలన్నింటిని ని కూడా తీరుస్తానంటూ హామీ ఇచ్చారు. కానీ ఈ హామీ అక్కడి రైతులకు కంటితడుపుగానే ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఎందుకంటే అమరావతి కోసం ఇంకా 16,666 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందంటూ సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో అంతర్జాతీయ క్రీడారంగం, రైల్వే స్టేషన్ నిర్మాణం, ఇన్నర్ రింగ్ రోడ్డు మరి కొన్నింటిని పూర్తి చేయాలని వాటన్నింటిని పూర్తి చేయాలి అంటే ఈ మాత్రం స్థలం కావాల్సిందే అంటూ తెలియజేశారు.లేకపోతే అమరావతి ఒక మున్సిపాలిటీ గానే మిగిలిపోతుందంటూ మాట్లాడారు.


ఇప్పటివరకు 50వేల ఎకరాల భూమిని ఇచ్చిన రైతుల కష్టాలు తీరడం లేదు. ఇప్పుడు మళ్లీ కొత్తగా భూ సమీకరణ చేపడతారని తెలిసి ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకే.. రైతులను రెండు రోజుల క్రితం పిలిపించి , రైతుల కష్టాలను తీరుస్తానని చెప్పి ఊరడించి పంపించారనే అనుమానం కలుగుతోంది. వాస్తవానికి 2024 ఎన్నికలలో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 45 వేల ఎకరాల భూమి కావాలని అందులో స్పోర్ట్స్ సిటీ, విమానాశ్రయం వంటివి నిర్మిస్తామంటూ ఊదరగొట్టినప్పటికీ ఈ విషయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో చేసేదేమీలేక ఈ విషయంతో వెనక్కి తగ్గిన సీఎం చంద్రబాబు.. విమానాశ్రయం అనే ఐడియాను పక్కకు నెట్టి మరీ ప్రస్తుతం 16 వేల ఎకరాల భూమిని సమీకరణ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: