దశాబ్దాల కాలం నుండి బహుజనులకు, రైతులకు, యువతకు, మహిళలకు, నిరుద్యోగులకు, ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోంది. వంచనకు, అణచివేతకు, దోపిడీకి గురవుతున్నారు. ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను, సహజ వనరులను, కులవృత్తులను దోపిడీ చేసి, అన్ని వర్గాలను అణచి వేస్తున్నారు. ఈ దగాను, దోపిడీని, అరాచకాలను చూస్తూ మౌనంగా ఉండలేక, రెండు తెలుగు రాష్ట్రాలకు పట్టిన రాజకీయ గ్రహణాన్ని వదిలించి, బహుజనులకు అధికారమే లక్ష్యంగా.. బహుజన చైన్యం-యువజన పోరాటం నినాదంతో భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భవించిందని మీ అందరికీ తెలుసు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్నో ఆటుపోట్లను, ఇబ్బందులను, అక్రమ కేసులను, అణచివేతలను, వెన్నుపోట్లును, కోవర్టుల కుట్రలను... అన్నింటినీ ఎదుర్కొంటూ, పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఈనాటి వరకు, ప్రభుత్వం ఏదైనా, పార్టీ ఏదైనా, ప్రజా వ్యతిరేక విధానాలు, దోపిడీ, అరాచకాల మీద రాజీలేని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బిసివై పార్టీ.


మన పార్టీ ఆశయసాధనే లక్ష్యంగా ఒక చారిత్రాత్మక కార్యాచరణకు సిద్దమవుతున్నాం.పార్టీ స్థాపించి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాలతో పార్టీ నిర్మాణం, కమిటీలు నియామకం చేపట్టాలనే సంకల్పంతో ఇంత సమయం తీసుకోవడం జరిగింది. ఆ చారిత్రాత్మక నిర్మాణానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. బిసివై పార్టీ రాష్డ్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, పంచాయితీ, గ్రామ స్థాయి కమిటీలు నిర్మాణం చేపట్టి పార్టీ సిద్దాంతాలు, ఆశయాలను ప్రతి గడపకూ తీసుకెళ్లే లక్ష్యంతో బృహత్తర కార్యాచరణ రూపొందిస్తున్నాం. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరినీ ముఖ్యంగా యువతను రాజకీయాల్లో ప్రోత్సహిస్తూ... పార్టీలోకి ఆహ్వానించి, తగిన బాధ్యతలు అప్పగించేందుకు శ్రీకారం చుట్టబోతున్నాం


బిసివై పార్టీ ప్రాధమిక సభ్యత్వం, శాశ్వత సభ్యత్వ నమోదును ప్రారంభించి, పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఇప్పటి వరకు బిసివై పార్టీతో కలిసి నడుస్తున్న ప్రతి నాయకుడు, కార్యకర్తకు, మన పార్టీ జెండా మోస్తున్న ప్రతి బిసివై పార్టీ కుటుంబ సభ్యుడికి నేను ఇస్తున్న మాట ఒక్కటే.. మీకు తిరుగులేని గుర్తింపు, సముచిత ప్రాధాన్యత, బాధ్యత కల్పించడంతో పాటు పార్టీ ఆశయాలకు, సిద్దాంతాలకు అనుగుణంగా, పార్టీలోకి రావాలనే ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తూ... మీ అందరి రాజకీయ భవిష్యత్తుకు  నేను భరోసా కల్పించి.. ఆ బాధ్యత తీసుకుంటున్నాను.


పార్టీ పూర్తి స్థాయి నిర్మాణం చేపట్టి, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పిస్తూ... బిసివై పార్టీని తిరుగులేని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిర్మించడమే లక్ష్యంగా "బిసివై భరోసా యాత్ర" చేపట్టబోతున్నాం. రండి.. కలిసి నడుద్దాం..! చరిత్ర తిరగరాయాల్సిన సమయం ఆసన్నమైంది... మన శకం మొదలైంది.‌ రెండు తెలుగు రాష్ట్రాల దోపిడీ రాజకీయాలకు అంతం పలికి, దశాబ్దాల కాలంగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న దుష్ట రాజకీయ శక్తులను పాతాళానికి తొక్కి ప్రజా రాజకీయం దిశగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా... రైతుల సంక్షేమానికి, యువత భవిష్యత్తుకు, మహిళా సాధికారతకు, బహుజనుల అధికారానికి బాటలు వేద్దాం అని భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్య‌క్షుడు బోడె రామచంద్ర యాదవ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: