వైసిపి పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు.. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తూ ఉంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్లుగా మారిపోయిందంటూ విమర్శించారు. రైతులను ఏ ప్రభుత్వమైనా ఆనందపరిచేలా ఉండాలని రైతుల సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుందని.. పండగల జరగాల్సిన వ్యవసాయం చంద్రబాబు సీఎం అయిన తర్వాత దండుగలా మారిపోయిందని తెలియజేశారు. తుఫాను కారణాల చేత నష్టపోయిన రైతులకు పైసా పరిహారం కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.



గత ఏడాది రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేక నష్టపోయారు. ఈ ఏడాది తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోలేదని దీంతో దళారులదే హవాగా మారిపోయిందని తెలియజేశారు. మా ప్రభుత్వ హయాంలో రైతులకు ఇలాంటి సమయాలలో అన్ని విధాలుగా అండగా ఉండే వాళ్ళము కానీ ఇవాళ రైతులు ఎలా పోయిన పట్టించుకునే నాధుడే కరువయ్యారంటూ తెలియజేశారు. రైతులు పండించిన పంటకు రేట్లు లేవు కేజీ అరటి అర్ధ రూపాయి అంటే రైతులు ఎలా బ్రతకాలి, ఇంత ఘోరమైన పాలన చంద్రబాబుకి సొంతం అంటూ ఫైర్ అయ్యారు.

గత ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాము.. రైతన్నల కోసం రైళ్లు  నడిపించి మరి పంటను ఎగుమతి చేశాము. దీనివల్ల రైతులకు 20 నుంచి 40 శాతం వరకు రేట్లు పెరిగాయని కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారు? రైతులను పట్టించుకోకుండా రైతులను మోసం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇచ్చేశాం అంటున్నారు. సూపర్ సిక్స్ లో అసలు ఏం చేశారో చెప్పాలి. వీళ్లను చూస్తే గ్లోబల్ ప్రచారం ఎలా చేసుకోవాలో నేర్చుకోవాలి.. ఎన్నికల ముందు ఓట్ల కోసం సూపర్ సిక్స్ అన్నారు. నిరుద్యోగ భృతి రూ .3000 అన్నారు, రెండేళ్లుగా రూ .72000 ఇవ్వాలి, ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ల నిండిన మహిళలకు ప్రతినెలా రూ .1500 అన్నారు ఇప్పటికి ఇవ్వలేదు. బీసీ, ఎస్టీ, ఎస్సీ ,మైనారిటీలకు  50 ఏళ్లకే పెన్షన్ అన్నారు ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లకు రైతులకు రూ .40 వేలు ఇవ్వాలి ఇచ్చింది రూ .10000 మాత్రమే.. తల్లికి వందనం కింద మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు రెండవ సంవత్సరం 20 లక్షల మంది తల్లుల ఖాతాలను తగ్గించారు. ఏడాదికి మూడు సిలిండర్లు అన్నారు. రెండేళ్లలో 6 రావాల్సింది. ఒకటో రెండో ఇచ్చి చేయి దులుపుకున్నారని.. ఇలా మోసం చేసే వారిని బొక్కలు వేయాలి కదా? అంటూ జగన్ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: