బంగారం బాటలోనే ఇప్పుడు వెండి కూడా నడుస్తోంది. కేవలం ఒక్క రోజులోనే ఏకంగా కేజీ వెండి పైన 11 వేల రూపాయలు పెరగగా. బుధవారం, గురువారం మధ్యలో కొంత స్వల్పంగా పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో ప్రస్తుత వెండి కేజీ ధర రూ. 2.22 లక్షల వద్ద కొనసాగుతోంది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు వెండి భారీగానే పెరిగిపోయింది. ప్రపంచ వాణిజ్యంలో బంగారం కంటే వెండి గిరాకీ కూడా ఎక్కువగా ఉన్నట్టుగా మార్కెట్ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు.
బంగారం ధరలు ఇంత భారీ మొత్తంలో పెరగడానికి ముఖ్య కారణం డాలర్ విలువ పడిపోవడమే అంటూ నిపుణులు తెలియజేస్తున్నారు. అందువల్లే బంగారం, వెండి ధరలలో కొంతమేరకు హెచ్చుతగ్గులు ఏర్పడుతూ ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,23, 460వద్ద ఉన్నది.
హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,520 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,310 వద్ద ఉంది.
విజయవాడ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,520 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,310 వద్ద ఉంది.
బెంగళూరు: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,520 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,310 వద్ద ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి