ఎవ్వ‌రెమ‌నుకున్నా తెలంగాణ సీఎం కేసీఆర్ దేశంలో ఉన్న అంద‌రి సీఎంల కంటే ఆధ్యాత్మిక‌త చాలా ఎక్కువేన‌ని చెప్పాలి. ఆయ‌న ప్ర‌తి ప‌నికి ముందు వేద పండితుల నుంచి  స‌ల‌హాలు తీసుకుని ముందుకు పోతారు. ఇక వాస్తు విష‌యంలో ఆయ‌న తీసుకునే జాగ్ర‌త‌లు ఇంత‌వ‌ర‌కు ఏ సీఎం తీసుకోలేదంటే ఆతిశ‌యోక్తి లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ మించి దేవానుగ్ర‌హం కోసం నిరంత‌రం వైంప‌ర్లాడుతుంటారు. గ‌తంలో ఎన్టీఆర్ సైతం స‌మ‌యం,తిధి, న‌క్ష‌త్రాలు త‌దిత‌ర మ‌హుర్తాల‌ను  చూసుకునే వారు. చాలా రోజుల త‌రువాత ఇప్పుడు అదే ప‌ద్ద‌తుల‌ను అవ‌లంభిస్తున్నారు సీఎం కేసీఆర్‌.


ఏదైనా ప‌నిని మొద‌లు పెట్టిన‌ప్పుడు దేవుడిని మొక్కుకుని ఏ ఇబ్బంది లేకుండా ముగిస్తే, దేవుడికి ఏదో ఓ ర‌కంగా మొక్కుతీర్చుకునే అల‌వాటు తెలుగు ప్ర‌జ‌ల్లో ఉంది. ఎన్నో సాంకేతిక ప‌రిజ్ఞానం మనుషుల్లో మార్పు తీసు కొచ్చినా ఇప్ప‌టికి దైవ మొక్కులో మాత్రం మార్పు రావ‌డం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్ర‌పంచ దేశాల్లో పేరుగాంచిన తిరుప‌తి వెంకటేశ్వర దేవాల‌యం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌పంచ దేశ నాయ‌కులు సైతం వెంక‌న్న మొక్కుతీర్చుకోనిది వెళ్ల‌రు.  ఇప్ప‌టికే వెంక‌న్న స‌న్నిధానంలో  ప్రత్యేకంగా నాలుగు పెద్ద సాలగ్రామాలు, ఇంకా చిన్న సాలగ్రామాలు కొన్ని నిత్యాభిషేకార్చనలందుకుంటూ ఉన్నాయి. ఈ సాలగ్రామాలన్నీ శ్రీ స్వామివారి పాదాల చెంత వెండి పాత్రల్లో ఉంచబడి పూజింపబడుతూ ఉన్నాయి. 
 
ప్రతిరోజు భోగ శ్రీనివాసమూర్తులతో పాటు ఈ సాలగ్రామాలకు అభిషేకం జరిగిన తరువాత అన్ని మూర్తులతో పాటు ఈ సాలగ్రామాలకు పుష్పార్చన, నివేదన జరుపబడు తున్నది. ఇలా పూజలందుకుంటూ ఉన్న సాల గ్రామాలు మాత్రమే కాక, శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్యమూలవిరాణ్మూర్తికి ఇరువైపులా రెండు భుజాల నుంచి పాదాల వరకు వేలాడుతున్న దివ్యసాలగ్రామ హారాలు నిత్యశోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. బంగారు కవచాలలో పొదుగబడి కూర్చబడిన ఈ రెండు సాలగ్రామ హారాలు మాత్రమే కాకుండా పూర్వం ప్రసిద్ధ ద్వైత సంప్రదాయ పీఠాధిపతులైన శ్రీ వ్యాసతీర్థులవారు శ్రీ వేంకటేశ్వరస్వామివారికి మరొక సాలగ్రామహారం సమర్పించినట్లు తెలుస్తోంది. 

విజయనగర చక్రవర్తులైన వీర నరసింహరాయలు, క్రిష్ణదేవరాయలు, అచ్యుతరాయలు ఇలా ఈ ముగ్గురికీ గురువులుగా ప్రసిద్థి చెందిన వారు శ్రీ వ్యాసరాయలు. ముఖ్యంగా శ్రీ క్రిష్ణదేవరాయలకు కలిగిన కుహూ యోగ మనే కాలసర్పదోషం నుండి రక్షించడానికి కొన్ని ఘడియల కాలం విజయనగర సింహాసనాన్ని అధిష్టించి తమ తపస్సక్తి చేత ఆ సర్పదోషాన్ని భస్మం చేశారట. అందువల్ల కొద్దికాలం విజయనగర సింహాసనాన్ని అధిష్టించిన వ్యాసతీర్థులవారికి వ్యాసరాయలు అనే ప్రసిద్థ నామం ఏర్పడినట్లు చరిత్ర చెబుతోంది.
 
ఆ తరువాత అదే సమయంలో తిరుమల శ్రీవారి ఆలయంలో అర్చన నిర్వహిస్తూ ఉన్న వైఖానస అర్చకులకు ఏదో అవాంతరం ఏర్పడి శ్రీ స్వామివారి అర్చనాది కార్యక్రమాలకు విఘాతం కలుగగా శ్రీ వ్యాసతీర్థుల వారు సుమారు 12 యేళ్ళ పాటు తిరుమల క్షేత్రంలోనే ఉంటూ స్వయంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించారట. ఆ తరువాత అర్చనాది కార్యక్రమాలు పరహస్తం కాకుండా తిరిగి సంప్రదాయం ప్రకారం వైఖానస అర్చకులకు అప్పజెప్పారట. తాజా సీఎం కేసీఆర్ సైతం వెంక‌న్న మొక్కును తీర్చుకు నేందుకు సిద్ద‌మ‌య్యారు.

తెలంగాణ కోసం పార్టీ పెట్టి దాదాపు 12 సంవత్స రాలు నిర్విరామంగా పోరాడి మొత్తానికి తాను అనుకున్నది సాధించారు కెసిఆర్. 2014లో ఆయన కల నిజమైంది. ఎన్నో సంవత్సరాల నుండి కోరుకుంటున్న తెలంగాణ కోసం ఇక్కడి ప్రజలు కొన్ని దశాబ్దాలుగా పోరాడుతు న్నారు. కానీ ప్రత్యేక తెలంగాణ రాలేదు. 2001లో కెసిఆర్ టీడీపీ నుండి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీ పెట్టినపుడు చాలామంది చులకనగా మాట్లాడారు. కెసిఆర్ వల్ల ఏం ఒరుగుతుంది అనుకున్నారు. కానీ ఆయన ఎవరేం అన్నా పట్టించుకోకుండా తాను చేరాల్సిన లక్ష్యం వైపు దూసుకుపోయారు. 

మధ్యలో ఎన్నో అవాంతరాలు ఆయనకు అడ్డుగా నిలిచాయి. అయినా భయపడకుండా ఆయన ముందుకే వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రత్యేక తెలంగాణ రావాలని చాలామంది దేవుళ్ళకు మొక్కులు మొక్కారు. ఇప్పుడు తెలంగాణ వచ్చాక ఆ దేవుళ్లందరికీ మొక్కులు చెల్లిస్తున్నారు. 2010లో తిరుమల శ్రీవారికి కెసిఆర్ తెలంగాణ కోసం మొక్కుకున్నారు. దానికోసం ఇప్పుడు 5.59 కోట్ల రూపాయలతో శ్రీవారికి సాలగ్రామహారం, పెటాల కంఠాభరణం ఇవ్వబోతున్నారు. ఈ నగల్ని కోయంబత్తూర్ లో 19 కేజీల బంగారంతో చేయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: