పవన్ కళ్యాణ్ జనసేనాని ఏం చేయబోతున్నారు. ఎన్నికల్లో ఘోర అవమానం జరిగింది. తాను పోటీ చేసిన రెండు సీట్లలో ఓడిపోయారు. ఇది నిజంగా దారుణమే. ఎందుకంటే ఎక్కడైనా అధినేత కనీసం గెలుస్తారు. అందునా స్టార్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ కనీసం తన సీటు తాను నిలబెట్టుకోకపోతే రాజకీయనగా అది బిగ్గెస్ట్ షాకే మరి.


అయితే పవన్ కి ఇపుడు కొత్త సమస్య వచ్చిపడింది. పార్టీని ఎలా నడపడం అన్నదే ఆ సమస్య. పవన్ పార్టీ తరఫున పోటీ చేసిన వారు ఉన్నారు. అయితే వారిలో చాలా మంది కొత్తవారు. పవన్ని చూసి గెలిపిస్తారని ఆశపడి వచ్చినవారు. ఇపుడు వారు ఓడిపోయి ఎటూ కాకుండా పోయారు. మరో వైపు అర కొరగా చేరిన ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఇపుడు పక్క చూపులు చూస్తున్నారు. మొత్తానికి పవన్ పార్టీని నడపలేడని అర్ధమైపోయిన వారు జంప్ చేసేందుకే రెడీ అవుతున్నారు.


ఈ టైంలో పవన్ మళ్ళీ పార్టీ నాయకుల కోసం పరామర్శ యాత్ర ఒకటి చేపడతారని అంటున్నారు. మీరు ఆందోళన చెందవద్దు, పార్టీని నేను మా అన్న చిరంజీవిలా మూసేయను. రాజకీయల్లో కొనసాగుతాను, 2024లో మంచి రోజులు వస్తాయి, ముందుగా లోకల్ బాడీ ఎన్నికల్లో తేల్చుకుందామని నాయకులకు నచ్చచెప్పేందుకు పవన్ యాత్ర చేపడతారట. మరి పవన్ మాటలు నమ్మి పార్టీలో ఎవరైనా ఉంటారా. జనసేన ఫ్యూచర్ ఏంటి అన్నది ఇపుడు ప్రశ్నార్ధకరంగా ఉంది. మరి ఈ విషయంలో పవన్ ఎంతవరకూ ఓదార్పు ఇస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: