ప్రతివారం ఎల్లోమీడియాలో రాసే కొత్తపలుకులో ప్రతిసారి లాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై కావాల్సినంత బురద చల్లేశాడు దాని ఎండి వేమూరి రాదాకృష్ణ. ఇందులో న్యాయస్ధానాలతో ఘర్షణ, కరోనా వైరస్ ను నిర్లక్ష్యం చేయటం, అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేకుండా చేయటమనే అనైతిక విధానాలకు జగన్ పాల్పడుతున్నట్లు తీర్పుచెప్పేశాడు. సరే ఒక్క జగన్ను మాత్రమే అంటే బాగుండదని పనిలో పనిగా కేసీయార్ ను కూడా సీన్ లోకి లాగాడులేండి. న్యాయవ్యవస్ధ విషయానికి వస్తే నిమ్మగడ్డకు అనుకూలంగాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడూ ఉండే ఏడుపే. అసలు వివాదానికి మూల కారణమే నిమ్మగడ్డ చేసిన ఓవర్ యాక్షన్. ఆ విషయం వదిలిపెట్టేసి నింద పూర్తిగా జగన్ పైనే వేసేశాడు. నిమ్మగడ్డ చేసిందీ తప్పే తర్వాత జగన్ చేసిందీ తప్పే అనటంలో సందేహమే లేదు. లేని అధికారాన్ని చేతుల్లోకి తీసుకుని ఆర్డినెన్సు జారీ చేసి నిమ్మగడ్డను తప్పించటం జగన్ చేసిన తప్పు.

 

ఓ వివాదంలో ఇద్దరిదీ తప్పున్నపుడు ఎల్లోమీడియా మాత్రం కేవలం జగన్ను మాత్రమే తప్పని తీర్పు చెప్పటం  ఏ తరహా జర్నలిజమో ?  పైగా ఈ వివాదంలో బోలెడన్ని రాజకీయాలున్నాయి. నిమ్మగడ్డ వెనుక చంద్రబాబునాయుడు, బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సిపిఐ నారాయణతో పాటు బిజెపిలోని ఫిరాయింపు ఎంపి సుజనా చౌదరి లాంటి వాళ్ళున్నారంటూ వైసిపి నేతల ఆరోపణలు అందరికీ తెలిసిందే. కాబట్టి వివాదం జగన్ వర్సెస్ నిమ్మగడ్డ అండ్ కో గానే చూడాలి. సరే ఇక ఎల్లోమీడియా చెప్పిన అనైతిక రాజకీయాల విషయం చూద్దాం. అసెంబ్లీలో చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా జగన్ ప్రయత్నిస్తున్నట్లు పెద్ద ఆరోపణలే చేసింది. నిజానికి ఇప్పటివరకూ జగన్ ఆదిశగా ఆలోచించనే లేదు. ఎల్లోమీడియా చెప్పిందే నిజమైతే ప్రతిపక్ష హోదా ఎప్పుడో ఊడిపోయేదే.

 

అసెంబ్లీలో జగన్ కు పూర్తి మెజారిటి ఉన్నపుడు ఇంకా చంద్రబాబు గురించి ఆలోచించటమే అనైతికమని ఎల్లోమీడియా తేల్చేసింది. మరి చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు చేసింది ఏమిటి ?  జగన్ను అసెంబ్లీలోకి అడుగుకూడా పెట్టనీయమని టిడిపి నేతలు చేసిన చాలెంజులు ఎల్లోమీడియాకు గుర్తులేదా ? ఏమవసరం వచ్చిందని 23 మంది  వైసిపి ఎంఎల్ఏలను చంద్రబాబు టిడిపిలో చేర్చుకున్నాడు ? అంటే ఎల్లోమీడియా ప్రకారమే చంద్రబాబులో నైతిక విలువలు లేవని తేలిపోయినట్లే  కదా ?  వైసిపి ఎంఎల్ఏలను టిడిపిలోకి లాక్కున్నా చంద్రబాబు గురించి ఎందుకు మాట్లాడలేదు ?  మరి ఒక్క టిడిపి ఎంఎల్ఏను కూడా జగన్ వైసిపిలో చేర్చుకోలేదే . మరి జగన్ అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్లు ఎల్లోమీడియా  చెప్పటంలో అర్ధమేంటి ?

 

స్ధానిక సంస్ధలన్నింటినీ కైవసం చేసుకోవాలని జగన్ వేసిన ప్లాన్ కు ఎన్నికల వాయిదాతో నిమ్మగడ్డ అడ్డుపడ్డాడట. పెన్ను చేతిలో ఉందని అడ్డమైన రాతలు రాస్తే జనాలు నవ్వుతారని కూడా లేదు. ఎన్నికల జరిగినంత మేర మెజారిటి స్ధానాలు వైసిపికే దక్కాయి. మధ్యలో ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మెజారిటి సీట్లు వైసిపికే దక్కుతాయనటంలో సందేహమే లేదు. మరిందులో నిమ్మగడ్డ అడ్డుపడిందెక్కడ. చాలా చోట్ల టిడిపి నామినేషన్లే వేయలేదన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఆ స్ధానాలన్నీ వైసిపిలో ఖాతాలో పడకుండా నిమ్మగడ్డ ఎలా అడ్డుపడగలడు ? పైగా స్ధానిక సంస్ధలన్నింటినీ టిడిపి చేతిలో పెట్టుకుని కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందని ఎల్లోమీడియా చెప్పింది వాస్తవం. మరప్పట్లో వైసిపి తరపున గెలిచిన వాళ్ళలో చాలామందిని చంద్రబాబు ఎందుకు టిడిపిలో చేర్చుకున్నాడో ఎల్లోమీడియా సమాధానం చెప్పగలదా ?

 

ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించినపుడు కోర్టులో కూడా అడ్డుపడలేవట. వైసిపి ఎంఎల్ఏ రోజాను ఏకంగా ఏడాదిపాటు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసినపుడు చంద్రబాబు బాధ్యతగా వ్యవహరించలేదని ఎల్లోమీడియా ఒప్పేసుకుంది. నిబంధనలకు వ్యతిరేకంగా ఏడాది పాటు రోజాను సస్పెండ్ చేయటం తప్పని హైకోర్టు కూడా తేల్చిచెప్పింది. అయినా చంద్రబాబు అప్పుడు హైకోర్టు తీర్పును ఎందుకు ఆమోదించలేదు ? అసెంబ్లీలోకి కాదు కదా కనీసం అసెంబ్లీ కాంపౌండ్ లోకి కూడా రోజాను అనుమతించని విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు కూడా కళ్ళు మూసుకుపోయే వ్యవహరించాడు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కదా నియమ, నిబంధనలని, న్యాయం, ధర్మమని ట్విట్టర్లో గొంతు చించుకుంటున్నది.  ఈ విషయాలను ఎల్లోమీడియా మరుగన పరచినా జనాలు మరచిపోరని గుర్తుంచుకుంటే మంచింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: