చూడబోతుంటే వ్యవహారం అలాగే అనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబునాయుడును  ఘెరంగా ఓడించిన జగన్మోహన్ రెడ్డి అంటే ఎల్లోమీడియా యాజమాన్యానికి బాగా మండిపోతోంది. దాంతో బుర్రకు తోచిన చెత్తంతా రాసేస్తున్నారు. అయినా జనాల్లో పెద్దగా స్పందన రావటంలేదు. ఇదే సమయంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షునిగా పెద్ద ప్రబావం చూపలేకపోయారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారం సరేసరి. కాంగ్రెస్, వామపక్షాలను తలచుకునే వారే లేరు. దాంతో జగన్ కు వ్యతిరేకంగా ఎన్ని జాకీలు వేస్తున్న ఉపయోగం కనబడటం లేదు. ఇదే సమయంలో బీజేపీ అగ్రనాయకత్వం కన్నాను మార్చేసి సోము వీర్రాజును నియమించింది.




వీర్రాజు రావటం రావటమే చంద్రబాబును టార్గెట్ చేసుకుని వాయించేస్తున్నారు. తమ ప్రధమశతృవు చంద్రబాబే అంటు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అప్పటివరకు చంద్రబాబుపై కన్నా లక్ష్మీనారాయణ పెద్దగా మాట్లాడేవారు కాదు. దానికి భిన్నంగా వీర్రాజు రాగానే చంద్రబాబును టార్గెట్ చేసుకోవటం ఎల్లోమీడియాకు నచ్చినట్లు లేదు. అందుకని వీర్రాజు అండ్ కో పై మంట పెరిగిపోతోంది. అయితే ఏమి చేయలని పరిస్దితి. ఈ నేపధ్యంలోనే తమ స్టూడియోలో వీర్రాజు ప్రధాన మద్దతుదారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన రెడ్డిపై దాడి జరిగింది. అమరావతి ఉద్యమంపై మాట్లాడిన విష్ణు అమరావతి జేఏసీ నేత శ్రీనివాసరావుపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో ఆయన చెప్పుతీసుకుని దాడి చేశారు. ఇదంతా ప్రీ పాల్డ్ అనే అనుమానిస్తున్నారందరు.




అయితే తర్వాత జరిగిన డెవలప్మెంట్ లో శ్రీనివాస్ విషయం పక్కకు పోయి ఇపుడు వీర్రాజు అండ్ కో-ఎల్లోమీడియా అన్నట్లుగా తయారైంది వ్యవహారం. దాంతో తమ చెత్తపలుకలో వీర్రాజు, విష్ణు, రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావుతో పాటు రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జి సునీల్ దియోధర్ ను బ్లాక్  మెయిలర్లన్నట్లుగా బురద చల్లేశారు. నరేంద్రమోడి ప్రభుత్వాన్ని చూపించి పై నలుగురు రాష్ట్రంలో అందరినీ బెదిరించి బతికేస్తున్నారంటు తీవ్రమైన ఆరోపణలే గుప్పించారు. మరి చేసిన ఆరోపణలకు ఎల్లోమీడియా దగ్గర ఏమి ఆధారాలున్నాయో తెలీదు. విషయం చూస్తే ఎప్పటి నుండో వీర్రాజు అండ్ కో పై ఉన్న కడపులోని మంటంతా ఇపుడు బయటకు వచ్చేసినట్లు అనిపిస్తోంది. మరి పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: