సినిమా పరిశ్రమకు ఎంతో మంది నటీ నటులు వస్తుంటారు. కానీ అందరూ సక్సెస్ అవడం జరగదు. తమ స్వశక్తి నమ్ముకుని ముందడుగు వేస్తే విజయం దానంతట అదే వస్తుంది. ఈ రోజు స్మరణలో భాగంగా టాలీవుడ్ కమెడియన్ మరియు విలన్ సహాయక పాత్రలు చేసిన ఒక నటుడి గురించి తెలుసుకుందాం. సినిమా పరిశ్రమ ఒక మహా సముద్రం లాంటిది అంతా ఈజీగా అవకాశాలు రావు. ఎవరో ఒకరు సహాయపడితేనే అది సాధ్యం అవుతుంది. అలాంటి ఒక వ్యక్తి గురించి ఈ రోజు తెలుసుకుందాం.  అతను ఎవరో కాదు నర్సింగ్ యాదవ్. కానీ ఇతని అసలు ఎప్రు మాత్రం నర్సింగ్ యాదవ్ కాదు. మైల నరసింహ యాదవ్. అయితే సినిమా పరిశ్రమలో ఫేమస్ అయిన తర్వాత అందరూ నర్సింగ్ యాదవ్ అని పిలవడం మొదలు పెట్టారు.  ఇతను తన సినిమా కెరీర్ లో మొత్తం తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషలలో 300 అయి చిలుకు సినిమాలలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.  నర్సింగ్ యాదవ్ కేవలం ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. 

నటనపై ఆసక్తితో హైదరాబాద్ లో వేషాల కోసం ఎందరినో అడిగాడు. ఎన్నో రోజులు తిరిగాడు. కానీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. కానీ తన అదృష్టం ఒక మహిళ దర్శక నిర్మాత రూపంలో తన తలుపు తట్టింది. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల దర్శకత్వ వహించిన హేమాహేమీలు అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు. అయితే తనలోని నటుడిని ఆ సినిమా మంచి పేరును తీసుకు రాలేదు. అప్పుడే తన స్నేహితుడు మరియు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్షణ క్షణం చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో నర్సింగ్ యాదవ్ కు నటనకు ఆస్కారమున్న పాత్ర లభించింది. దీనితో తన పాత్రకు బాగా పేరొచ్చింది. ఒక విధంగా నర్సింగ్ యాదవ్ ఇన్ని సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అందులో ఒక స్థానాన్ని దక్కించుకున్నాడు అంటే అది రామ్ గోపాల్ వర్మ  ఇచిన అవకాశం అనే చెప్పాలి.  

ఇక ఆ సినిమా విజయంతో వరుసగా అవకాశాలను అందుకున్నాడు. అలా 300 చిత్రాల్లో వివిధ పాత్రలలో నటించి మెప్పించాడు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలలో నటించే అవకాశాలు అందించి, నర్సింగ్ యాదవ్ కెరీర్ బలపడడంలో తన దైన పాత్ర పోషించాడు. తన చివరి శ్వాస వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు.  అలా 2020 డిసెంబర్ 31 వ తేదీన కిడ్నీ సమస్యతో బాధ పడుతూ హైదరాబాద్ లో మృతి చెందాడు. కానీ నేటికీ ఆయనపై ఉన్న అభిమానం ఏమీ చెక్కు చెదరలేదు. నర్సింగ్ యాదవ్ నటించిన ఈ సినిమా వచ్చినా ఆయన నటనను చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. నర్సింగ్ యాదవ్ ఇన్ని సినిమాలు చేయడంలో రామ్ గోపాల్ వర్మ మరియు చిరంజీవి పాత్రలు కీలకం.

మరింత సమాచారం తెలుసుకోండి: