ఐపిఎల్ సీజన్లో మ్యాచ్ లన్ని మరి ఉత్కంఠ బరితంగా మారుతున్నాయి. ఊహించని పరిణామాలతో జట్టు విజయాలను సొంతం చేసుకుంటూ అటు అభిమానులను కూడా ఉత్తేజ పరుస్తున్నాయి. కొన్ని మ్యాచ్ ల దాకా చేజింగ్ లో విజయం సాదించిన ఈ సీజన్ లో ముందు బ్యాటింగ్ చేసి విజయ ఢంకా మోగించారు డిల్లీ డేర్ డెవిల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్. 


సన్ రైజర్స్ వర్సెస్ రాయల్ చాలెంజ్ బెంగుళూరు :


ఓ పక్క కొహ్లి విధ్వంసం మరో పక్క వార్నర్ చెలరేగడం ఇలా ఇంతకు ముందు పరిణామాలను సరి చూసుకుంటూ ఈ మ్యాచ్ సాగింది. అనుకున్నట్టుగానే బెంగుళూరు టాస్ గెలిచి సన్ రైజర్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అయితే ముందు నుండి దూకుడుతో ఆడిన రైజర్స్ జట్టు బెంగుళూరు బౌలర్స్ ను చీల్చి చెండాడారు. ఇక రైజర్స్ కెప్టెన్ వార్నర్ మరోసారి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.


డేవిడ్ వార్నర్ 50 బంతుల్లో 92, 9 ఫోర్లు, 5 సిక్సర్లు ప్రళయం సృష్టించగా.. విలియమ్సన్ 38 బంతుల్లో 50, 7 ఫోర్లతో వార్నర్ కు బాగా సహకారం అందించాడు. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది రైజర్స్. ఇక 195 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. లోకేశ్ రాహుల్ (28 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్), డివిలియర్స్ (32 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. గేల్ లేకపోవడం కొహ్లి 14 పరుగులకే అవుట్ అవడం సన్ రైజర్స్ కు విజాన్ని తేలిక చేసింది.    


ఢిల్లీ వర్సెస్ కోల్ కతా :


వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్ కతా కు చెక్ పెట్టింది ఢిల్లి. అంతేకాదు ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ లో ఢిల్లీ కోల్ కతా మీద ఘోర పరాజయం పొందింది. ఇప్పుడు ఆ ప్రతికారాన్ని తీర్చుకుని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది ఢిల్లీ జట్టు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా ఢిల్లీకి 20 ఓవర్లలో 186 పరుగులను ఇచ్చింది. ఓపెనర్లు వైఫల్యం చెందినా తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ (50 బంతుల్లో 68; 9 ఫోర్లు, 1 సిక్స్), బిల్లింగ్స్ (34 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో ఢిల్లీకి మంచి స్కోర్ అందించడంలో సహకరించారు.


ఇక 20 ఓవర్లలో 187 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్ కతా ముందు దూకుడు ప్రదర్శించినా లాభం లేకుండా పోయింది.. ఊతప్ప విధ్వంసం సృష్టించినా సరే జట్టుకి విజయాన్ని అందించలేకపోయాడు. 8 ఓవర్లకు 58 పరుగులు 3 వికెట్స్ కోల్పోవడంతో కోల్ కతా కష్టాల్లో పడ్డది. ఇక 24 బంతుల్లో 51 పరుగులు చేయాల్సిన దశలో రసెల్ (17), హోల్డర్ (0), ఉతప్ప పెవిలియన్ బాట పట్టారు. అప్పటి నుండి సమీకరణాలు 12 బంతుల్లో 31గా మారింది. కోల్ కతా మీద మరోసారి విరుచుకుపడ్డ ఢిల్లీ బౌలర్లు 19వ ఓవర్లో వెంటవెంటనే నరైన్ (4), ఉమేశ్ (2) అవుట్ చేసి విజయాన్ని అందుకున్నారు.       



మరింత సమాచారం తెలుసుకోండి: