క్రికెట్ ఆట రూపం క్రమంగా మారిపోతోంది. ఒకప్పుడు ఐదు రోజులు ఉంటే ఆట ఇప్పుడు ఐదు గంటల్లో తేలిపోతోంది. వన్డే, టీ 20 అంటూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలోనే టెస్ట్ మ్యాచ్ ను నాలుగు రోజులకు కుదించాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. ఐసీసీ కూడా ఇదే ఐడియా చెబుతోంది. అయితే దీన్ని తీవ్రంగా ఖండించాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.

 

కొత్త తరాన్ని ఆకర్షించడానికి ప్రతి దాన్నీ మార్చాల్సిన అవసరం లేదని సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. అయిదో రోజు బంతితో స్పిన్నర్లు అదరగొట్టాలని ప్రయత్నిస్తుంటారని సచిన్ టెండూల్కర్ చెబుతున్నాడు. ఇదంతా టెస్టు క్రికెట్ లో ఒక భాగమని సచిన్ టెండూల్కర్ తెలిపారు. స్పిన్నర్లకు ఉన్న ఈ సానుకూలాంశాన్ని తొలగించాలనుకోవడం న్యాయమేనా అని సచిన్ టెండూల్కర్ ప్రశ్నించారు.

 

క్రికెట్ లో ఎన్నో ఫార్మాట్ లు ఉన్నా.. జెంటిల్మన్ గేమ్ కు టెస్టులే స్వచ్ఛమైన రూపమని సచిన్ అన్నారు. సంప్రదాయమైన ఈ ఫార్మాట్ నిడివిని తగ్గించకూడదని సచిన్ అభిప్రాయపడ్డారు. 2023 నుంచి 2031 మధ్య కొత్త భవిష్యత్ పర్యటనల ప్రణాళికలో పూర్తిగా నాలుగు రోజుల టెస్టులే ఆడించాలని ఐసీసీ భావిస్తోంది. ఈ ప్రపోజల్ ను ఇప్పటికే.. విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా కెప్టెన్ పైన్ , స్పిన్నర్ లైయన్ అపోజ్ చేశారు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: