భారత్లో క్రికెట్ ఆట కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ప్రేక్షకులు అందరూ టీవీలకు అతుక్కుపోయిమరి మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. ఇక ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిపోయే మ్యాచ్ లో లీనమై తామే స్వయంగా మైదానంలో క్రికెట్ ఆడుతున్నాం ఏమో అన్నంతగా ఫీల్ అయి పోతూ ఉంటారు ప్రేక్షకులు. కేవలం అంతర్జాతీయ మ్యాచ్ లలో మాత్రమే కాదు అటు దేశీయ టోర్నీ లను కూడా చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు అందరు. అయితే ఇప్పటివరకు భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ పంచుతుంది  ఇండియన్ ప్రీమియర్ లీగ్.  అయితే ఐపీఎల్ మాత్రమే కాకుండా బీసీసీఐ ఎన్నో దేశవాళీ టోర్నీలో నిర్వహిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీ ఎంతో ఘనంగా జరిగింది. ఇక విజయ్ హజారే ట్రోఫీ లో భాగంగా ఎంతోమంది యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. కొంత మంది ఆటగాళ్లు తమ లోని కెప్టెన్సీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటే.. ఇంకొంతమంది అద్భుతంగా రాణించి ఏకంగా భారత జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీ లో ఛాంపియన్ తమిళనాడు జట్టును ఓడించి ఉత్తరప్రదేశ్ జట్టు వికెట్ విజయ్ హజారే ట్రోఫీ లో కొత్త ఛాంపియన్గా అవతరించింది. ఇకపోతే మరికొన్ని రోజుల్లో రంజీ ట్రోఫీ జరగబోతుంది. ఇక ఈ రంజీ ట్రోఫీలో ఎవరు ఎలా రానించబోతున్నారు అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


 ఇక మరికొన్ని రోజుల్లో జరగబోయే రంజీ ట్రోఫీలో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ ప్రమోషన్ పొందాడు అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు  భరత్. ఈనెల 13వ తేదీ నుంచి రంజి ట్రోఫీ ప్రారంభం కాబోతోంది. ఇక ఈ ట్రోఫీలో పాల్గొనబోయే ఆంధ్రప్రదేశ్ జట్టును ఆంధ్ర ప్రదేశ్ క్రికెట్ సంఘం ప్రకటించింది  ఈ క్రమంలోనే 21 మంది తో కూడిన రాష్ట్ర జట్టును ప్రకటన చేసింది. ఇక నేటి నుంచి విజయనగరంలో జట్టుకు శిక్షణ శిబిరం నిర్వహించబోతుంది ఆంధ్ర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్. మరి తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ కెప్టెన్గా ఎలా సత్తా చాటుతాడు  అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: