ఐపీఎల్ హిస్టరీ లో నే దిగ్గజ జట్టుగా కొనసాగుతుంది చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పుడు వరకు ఎక్కువ సార్లు ప్లే ఆఫ్ చేరిన జట్టుగా.. ఎక్కువసార్లు ఫైనల్ ఆడిన జట్టుగా.. ఎక్కువ సార్లు టైటిల్ విజేతగా నిలిచిన జట్టు గా కొనసాగుతోంది చెన్నై సూపర్ కింగ్స్. ఇక ప్రతి సీజన్లో కూడా అద్భుతమైన విజయాలతో ఎప్పుడూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అంటేనే ప్రత్యర్థులు వణికిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి  2022 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.



 దీంతో చెన్నై ఆడిన నాలుగు మ్యాచ్లో కూడా ఘోర పరాజయం పాలైంది. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తో జరిగిన మ్యాచ్ లో అనూహ్యంగా పుంజుకుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. మొదటి నుంచి పూర్తి ఆధిపత్యాన్ని సాధిస్తూ వచ్చిన చెన్నై జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది అని చెప్పాలి. ఒకవైపు బ్యాటింగ్లో  మరోవైపు బౌలింగులో కూడా ప్రత్యర్థిపై ఆధిపత్యం సాధించింది. ఈ మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఈ క్రమంలోనే నాలుగో ఓవర్లోనే రుతురాజ్ గైక్వాడ్ వికెట్ కోల్పోయి పెవిలియన్ చేరాడు.


 దీంతో గత మ్యాచ్ పరిస్థితులు ఇప్పుడు కూడా రాబోతున్నాయని అభిమానులు అనుకున్నారు. ఇక అదే సమయంలో శివం దూబే క్రీజులోకి వచ్చాడు. ఇక ఒకవైపు రాబిన్ ఉతప్ప మరోవైపు శివం దూబే బెంగుళూరు బౌలర్లపై శివతాండవం చేశారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక వీరిద్దరి వల్లే చెన్నై జట్టుకు విజయం వరించింది అని చెప్పినా తప్పు లేదేమో. ఇకపోతే బెంగళూరు తో మ్యాచ్ లో రాబిన్ ఉతప్ప శివమ్ దూబే జంట సరికొత్త రికార్డును నెలకొల్పింది. వీరు సాధించిన 165 పరుగుల భాగస్వామ్యం ఐపీఎల్ హిస్టరీ  లోనే రెండవ అత్యుత్తమం కావడం గమనార్హం.. తొలిస్థానంలో షేన్ వాట్సన్ డూప్లెసిస్ జోడి 2020 పంజాబ్ టీంపై 181 పరుగులతో టాప్ లో ఉంది. ఇక మురళీ విజయ్ మైకెల్ హస్సీ జోడి 2011లో ఆర్సిబిపై 159 పరుగుల తో మూడో స్థానంలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: