ప్రపంచ టెన్నిస్ లో దాదాపు మూడు దశాబ్దాలుగా ముగ్గురు మాత్రమే తమ ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు. వారిలో రోజర్ పెదరర్, రఫెల్ నాదల్ మరియు నోవాక్ జొకోవిచ్ లు ఉన్నారు. ఇక మధ్య మధ్యలో అప్పుడప్పుడు యువ కెరటాలు తమ సత్తా చాటుతూ ఈ సీనియర్ లకు షాక్ లు ఇస్తూ ఉంటారు. కాగా ఇటీవల మొదలైన ఫ్రెంచ్ ఓపెన్ లో మళ్ళీ రఫెల్ నాదల్ టైటిల్ ను సాధించి తనకు మట్టి కోర్ట్ లో ఎదురే లేదని సాటి చెప్పాడు. ఇక ఈ టోర్నీలో రోజర్ పెదరెర్ పాల్గొనలేదు. అయితే ఎప్పటి నుండో ఇతను మట్టి కోర్ట్ లో సత్తా చాటుతూ ప్రత్యర్థులను చిత్తు చేసి టైటిల్ ను ఎగరేసుకుపోతున్నాడు. ఇక 2022 ఫ్రెంచ్ ఓపెన్ లోనూ ఎవరి దగ్గర నుండి నాదల్ కు ప్రతిఘటన ఎదురు కాలేదు.. క్వార్టర్ ఫైనల్ లో జొకోవిచ్ నుండి కొంచెం గట్టి పోరాట ఉంటుందని అనుకున్నా జోకో కూడా నాదల్ ముందు తలొగ్గక తప్పలేదు.

అయితే సెమీఫైనల్ లో జ్వేరెవ్ గాయం కారణంగా రెండవ రౌండ్ లోనే నిష్క్రమించడంతో నాదల్ ఫైనల్ కు చేరుకున్నాడు. ఇక మరోవైపు రూడీ కూడా సిలిక్ ను సెమీఫైనల్ లో ఓడించి నాదల్ తో అమీతుమీకి సిద్దమయ్యాడు. నిన్న జరిగిన ఏ ఫైనల్ లో నాదల్ కన్నా అనుభవంలో ఎంతో తక్కువ అయిన రూడీ నాదల్ జోరు ముందు నిలవలేకపోయాడు. కేవలం మూడు వరుస సెట్ లలో 6-3, 6-3 మరియు 6-0 తేడాతో నాదల్ చిత్తు చిత్తుగా ఓడించాడు. అనుభవం లేని రూడీ పై నాదల్ పదునైన సర్వీస్ లు మరియు బ్యాక్ హ్యాండ్ షాట్ లతో విరుచుకుపడ్డాడు.

ఈ టైటిల్ తో నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ లో 14 వ సారి టైటిల్ ను నెగ్గాడు. కెరీర్ మొత్తంలో గ్రాండ్ స్లామ్ లను గెలుచుకుని ఫెదరర్ మరియు జొకోవిచ్ లేకనా రెండు అడుగులు పైనే ఉన్నాడు. దీనితో ఎందుకు రఫెల్ నాదల్ మట్టి కోర్ట్ లో డేంజర్ అన్నది మరికొందరికి తెలిసింది.



 

మరింత సమాచారం తెలుసుకోండి: