టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథంలో భారత మాజీ ఆటగాళ్లు అందరు కూడా తమ విశ్లేషణలతో ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు. తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొంతమంది మాజీ ఆటగాళ్లు టీమిండియా ప్రదర్శన పై ఇస్తున్న రివ్యూలు ఎప్పుడు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి టీమిండియని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయ్ అని చెప్పాలీ.


 ఇంతకీ మాజీ కోచ్ రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఏంటో తెలుసా.. టి20  వరల్డ్ కప్ తర్వాత భారత జట్టులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి అంటూ జోష్యం చెప్పాడు. ప్రస్తుతం జట్టులో సగానికి పైగా స్థానాలు తప్పకుండా గల్లంతవుతాయి అంటూ అంచనా వేశాడు.  అయితే 2021 టీ20 ప్రపంచ కప్ జట్టుతో పోల్చి చూస్తే ప్రస్తుత జట్టు కూడా ఇంచుమించు అలాగే ఉంది అంటూ రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. కానీ ప్రపంచక పూర్తయిన తర్వాత మాత్రం భారత జట్టు ఇలా ఉండదని.. ఎవరు ఊహించని రీతిలో మార్పులు మాత్రం తప్పకుండా జరుగుతాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు రవి శాస్త్రి. మొత్తంగా టి20 వరల్డ్ కప్ తర్వాత మాత్రం ఒక కొత్త టీమ్ ఇండియా జట్టును చూస్తామని జట్టులో ఎంతోమంది కొత్త ఆటగాళ్లు వస్తారని తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశాడు.


 అదే సమయంలో ఇక ప్రస్తుత భారత బ్యాటింగ్ విభాగంపై  తనదైన శైలిలో ప్రశంసలు కురిపించాడు.  ఓపెనర్లుగా రోహిత్ రాహుల్ వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో సూర్య కుమార్ యాదవ్, 5, 6 స్థానాలను హార్థిక్ పాండ్యా, రిషబ్ పంత్ లేదా దినేష్ కార్తీక్ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్..  గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉంది అంటూ పొగడ్తలతో ఆకాశానికెత్తేసాడు. కానీ భారత ఫీల్డింగ్  మాత్రం మరింత మెరుగుపడాల్సి ఉంది అంటూ తెలిపాడు. ఇక ఫీలింగ్ మెరుగుపరచుకుంటే తప్పక ఫలితం కూడా అనుకూలంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: