ప్రపంచం లోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కొనసాగుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా ఇటీవల మాజీ ఆటగాడు రోజర్ బెన్నీ ఎంపికయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన బీసీసీఐ సమావేశం లో బీసీసీఐ పెద్దలందరూ కూడా ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమం లోనే బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రోజర్ బిన్నీ మీడియా తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ముందు రెండు తక్షణ కర్తవ్యాలు ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించాడు. ఇక పూర్తిగా బాధ్యతలను తీసుకున్న తర్వాత రెండు విషయాలపై దృష్టి సారిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.


 ఇందులో ఆటగాళ్ల గాయాలను నివారించడం నా మొదటి ప్రాధాన్యత అంటూ చెప్పుకొచ్చాడు. బుమ్రా గాయం బారిన పడడం కారణంగా వరల్డ్ కప్ లో భారత ప్రణాళికపై ప్రభావం పడింది. అదే సమయంలో దేశంలోని పిచ్ ల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తాను అంటూ తెలిపాడు. కొంతకాలం నుంచి భారత జట్టులో కీలక ఆటగాళ్లందరూ వరుసగా గాయాల బారిన పడుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ మొదలుకొని సూర్యకుమార్ యాదవ్ సహ మరికొంతమంది ఆటగాళ్లకు కూడా గాయాల పాలవుతున్నారు. హెడ్ కోచ్ రవి శాస్త్రి ఆందోళన వ్యక్తం చేసాడు.


 బిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఐపిఎల్ ఫ్రాంచైజీలతో చర్చలు జరపాలని.. ఇక జాతీయ జట్టుకు ఆటగాళ్ల అవసరం ఎంత ఉంది అనే విషయంపై ఫ్రాంచైజీ లకు వివరించి ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చేలా ప్రణాళికలు రచిస్తే గాయాల బెడద నుంచి టీమిండియా బయట పడుతుందని సూచించాడు. అధ్యక్షుడిగా ఎన్నికైన బిన్నీ కూడా ఇదే విషయంపై ప్రస్తావించడంతో తన పాత మిత్రుడు సహచర ఆటగాడైన రవి శాస్త్రి చెప్పిన మాటను  బిన్నీ విన్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇద్దరు 1983 వరల్డ్ కప్ 1985 వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత్ జట్టులో సహచరులుగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: