ప్రస్తుతం టీమిండియా వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో వరల్డ్ కప్ గెలిచి విశ్వవిజేతగా నిలవాలని లక్ష్యంతో బలిలోకి దిగేందుకు సిద్ధమైంది టీమిండియా. ఈనెల 23వ తేదీ నుంచి టీమ్ ఇండియా అటు వరల్డ్ కప్ ప్రస్తానాన్ని మొదలుపెట్టబోతుంది అని చెప్పాలి. కాగా ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచ్లో మునిగి తేలుతుంది టీమిండియా. అయితే ఇలా వరల్డ్ కప్ లో ప్రస్థానం ముగిసిన వెంటనే టీమిండియా మళ్లీ వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీ కావడానికి షెడ్యూల్ ఖరారు అయింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే టీమిండియా ఏ దేశ పర్యటనకు వెళ్లబోతుంది అన్న విషయాన్ని ఇటీవల బీసీసీఐ అధికారికంగా ప్రకటిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఏకంగా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లేందుకు టీమిండియా సిద్ధమవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. దాదాపు ఏడేళ్ల నుంచి కూడా బంగ్లాదేశ్ పర్యటనకు దూరంగానే ఉంది టీమిండియ. భద్రతపరమైన కారణాల దృశ్య మరిన్ని రీజన్స్ తో ఇలా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లడం లేదు.. కానీ ఇప్పుడు ఏడేళ్ల గ్యాప్ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు సిద్ధమైంది.



 ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు రెండు టెస్ట్ మ్యాచ్ లలో సిరీస్ ఆడబోతుంది అనేది తెలుస్తుంది. ఇక డిసెంబర్ 4వ తేదీ నుంచి బంగ్లాదేశ్ టూర్ ప్రారంభం కాబోతుంది. కాగా 2015లో భారత్ చివరిసారిగా బంగ్లాదేశ్లో పర్యటించింది. అయితే రెండు దేశాల మధ్య చిరస్మరణీయమైన సిరీస్ కోసం ఎంతోమంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు అంటూ అటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది అని చెప్పాలి.  కాగా డిసెంబర్ 4, 7, 10 తేదీలలో 3 వన్డే మ్యాచ్లు జరగబోతున్నాయి. డిసెంబర్ 14, 18, 22, 26 తేదీలలో ఇక రెండు టెస్ట్ మ్యాచ్లు జరగబోతున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: