ప్రస్తుతం టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు ప్రస్థానం ఇక ప్రపంచ కప్లో ముగిసినట్లేనా? స్వదేశంలో వరల్డ్ కప్ జరిగిన ఆస్ట్రేలియా జట్టు పెద్దగా ఉపయోగించుకోలేకపోయిందా? ఆ జట్టు సరిగ్గా ఆడలేదా లేకపోతే దురదృష్టం వెంటాడిందా? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలే అంతర్జాతీయ క్రికెట్లో చర్చకు వస్తున్నాయి అని చెప్పాలి. టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా ప్రస్థానం ముగిసిపోయింది అని ఎంతో మంది విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 అయితే ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ లో భాగం గా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లలో ఆస్ట్రేలియా మొదటి వరుసలో ఉంది అని చెప్పాలి.  ఎందుకంటే సాధారణం గానే ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్లో మేటి జట్టుగా కొనసాగుతూ ఉంటుంది. మరోవైపు ఇక ఆస్ట్రేలియా వేదిక గానే టి20 వరల్డ్ కప్ జరుగుతూ ఉండడం తో స్వదేశీ పరిస్థితిలను ఉపయోగించుకుని విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన రీతిలో ఆస్ట్రేలియాకు చేదు అనుభవం ఎదురయింది.

 డిఫెండింగ్  ఛాంపియన్గా పేరున్న ఆస్ట్రేలియాకు టి20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరే అవకాశాలు సన్నగిల్లుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పటికి రెండు మ్యాచ్ లలో ఒకటి గెలిచి.. మరొకటి ఓడిన ఆస్ట్రేలియాకు రెండు పాయింట్లు ఉన్నాయి  ఇంగ్లాండ్లతో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దుకావడంతో ఒక పాయింట్ వచ్చింది. దీంతో మొత్తం మూడు పాయింట్లతో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ రైట్ కూడా మైనస్ లో ఉండడం గమనార్హం. ఇక న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా సెమిస్ చేరాలంటే న్యూజిలాండ్ లేదా ఇంగ్లాండ్ మిగతా అన్ని మ్యాచ్లలో ఓడి ఇక ఆస్ట్రేలియా భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. లేదంటే ఆస్ట్రేలియా ప్రస్థానం ముగిసినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: