ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 ప్రపంచ కప్ లో భాగంగా ప్రేక్షకుల ఊహకు అందని రీతిలో ఎన్నో సంచలనాలు నమోదయ్యాయి అన్న విషయం తెలిసిందే. బౌలింగ్ విభాగం లో బ్యాటింగ్ విభాగం లో ఎంతో పటిష్టం గా కనిపిస్తూ ఛాంపియన్ జట్లు అనే ట్యాగ్ తో బరి లోకి దిగిన కొన్ని టీమ్లకు అప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా చెప్పుకోదగ్గ ప్రస్థానం లేని పసికూన జట్లు షాక్ ఇచ్చాయి. ఈ క్రమంలోనే కొన్ని జట్లను ఏకంగా సెమీఫైనల్ చేరకుండా ఇంటికి పంపడంలో పసికూన జట్లే కీలక పాత్ర వహించాయి అని చెప్పాలి.


 ముఖ్యంగా ఇటీవలే సూపర్ 12 మ్యాచ్లలో భాగంగా సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో వచ్చిన ఫలితం అటు క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం షాక్ కి గురి చేసింది.  ఇక అప్పటి వరకు వరల్డ్ కప్ లో భాగంగా ఉన్న అన్ని సమీకరణాలను మార్చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పసికూన నెదర్లాండ్స్ పై భయంకరమైన సౌత్ ఆఫ్రికా అలఓకగా విజయం సాధించడం ఖాయమని క్రికెట్ ప్రపంచం మొత్తం నమ్మింది. ఇలాంటి సమయంలో పసికూన నెదర్లాండ్స్ మాత్రం సౌత్ ఆఫ్రికా కి షాక్ ఇచ్చింది.


 ఏకంగా వరల్డ్ ఛాంపియన్ జట్టుపై పసికూన నెదర్లాండ్స్ విజయం సాధించింది. దీంతో ఒకసారిగా సమీకరణాలు మారిపోయాయి. ఇక సౌత్ ఆఫ్రికా ఓటమి కారణంగా ఇంటిదారి పట్టింది. అయితే సౌత్ ఆఫ్రికా ఓటమి పాలు కావడంపై జట్టు కెప్టెన్ బవుమ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇక ఇలా మ్యాచ్ అనంతరం  భావుమా మాట్లాడిన వీడియోని తెలుగు డైలాగులతో మ్యాచ్ చేస్తూ కొంత మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో ఎంతో మందిని కడుపుబ్బా నవ్విస్తుంది అని చెప్పాలి. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: