తెలుగు అమ్మాయిలు ఎందులో తక్కువ కాదని నిరూపిస్తున్నారు..మ్యుజిక్ వింటే ఎలాంటి వారైన కూడా కాలు కదిపి డ్యాన్స్ వెయ్యాల్సిదే..ఇక అసలు విషయానికొస్తే.. తెలంగాణకు చెందిన స్టార్‌ బాక్సర్‌, వరల్డ్‌ బాక్సింగ్ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ తనలోని కొత్త ట్యాలెంట్‌ను పరిచయం చేసింది. బాక్సింగ్‌ రింగ్‌లో ప్రత్యర్థులపై పంచుల వర్షం కురిపించే ఆమె సరదాగా డ్యాన్స్‌ చేసింది..తనకు ఎంతో ఇష్టమైన బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌తో కలిసి. కండలవీరుడు నటించిన సూపర్‌ హిట్ మూవీ లవ్‌ లోని ఐకానిగ్‌ సాంగ్‌ను సాథియా తూనే క్యా కియా పాటను రీక్రియేట్‌ చేస్తూ అద్భుతంగా డ్యాన్స్‌ చేసింది. బాక్సర్‌ నిఖత్‌ మూమెంట్లకు తగినట్లు సల్మాన్‌ కూడా స్టెప్పులు వేశాడు.


ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. 'ఇంతేజార్ ఖతం హువా' అంటూ సల్మాన్‌తో డ్యాన్స్‌ చేయాలన్న తన కల నిజమైందని మురిసిపోయింది. కాగా సల్మాన్‌, నిఖత్‌ల డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. విపరీతంగా లైకులు, కామెంట్లు వచ్చేస్తున్నాయి.. చాలా బాగా చేశావు అంటూ పలువురు కామెంట్లు కూడా చేస్తున్నారు.ప్రముఖ సౌతిండియన్‌ డైరెక్టర్‌ సురేష్‌ కృష్ణ తెరకెక్కించిన లవ్‌. సల్మాన్‌ ఖాన్‌, రేవతి జంటగా నటించారు. ఇదే ను తెలుగులో ప్రేమ పేరుతో రీమేక్‌ చేశారు. ఇక్కడ సల్మాన్‌ ప్లేసులో విక్టరీ వెంకటేశ్‌ నటించాడు. ఇప్పుడు ఆ చిత్రంలోని పాటపైనే నిఖత్ డ్యాన్స్ చేయడం విశేషం. కాగా ఈ ఏడాది మేలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ గోల్డ్ మెడల్ కొట్టిన సంగతి తెలిసిందే.


జరీన్‌ మెడల్ గెలిచిన సమయంలో ఆమెను సల్మాన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆ సాన్నిహిత్యంతోనే ఇప్పుడు ఆయనతోనే కలిసి స్టెప్పులేసిందీ స్టార్‌ బాక్సర్‌. ఇక సల్మాన్‌ ప్రస్తుతం కిసీ కి భాయ్ కిసీ కి జాన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుండగా.. విక్టరీ వెంకటేశ్‌, జగపతి బాబు, విజేందర్‌, మాళవిక శర్మ వంటి తెలుగు తారలు సందడి చేయనున్నారు. ఇక మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు..మరింత సమాచారం తెలుసుకోండి: