
అదే సమయంలో ఇటీవల విజయ హాజరే ట్రోఫీలో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో రూతురాజు గైక్వాడ్ ఒక ప్రపంచ రికార్డును క్రియేట్ చేశాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వరకు ఎంతో మంది క్రికెటర్లు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన రికార్డును క్రియేట్ చేయగా ఇటీవల ఋతురాజు గైక్వాడ్ మాత్రం ఏకంగా ఒకే ఓవర్ లో ఏడు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డును క్రియేట్ చేశాడు. మధ్యలో బౌలర్ ఒక నోబాల్ వేయడంతో ఇక ఆ బంతిని కూడా సద్వినియోగం చేసుకొని సిక్సర్ గా మలిచాడు అని చెప్పాలి.
తద్వారా ఒక గొప్ప రికార్డును క్రియేట్ చేశాడు రుతురాజ్. అయితే ఇదే సమయంలో మరో చెత్త రికార్డు కూడా నమోదయింది అని చెప్పాలి. ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శివసింగ్ చెత్త రికార్డును నెలకొల్పాడు. మహారాష్ట్ర ఇన్నింగ్స్ సమయంలో 49వ ఓవర్ వేసిన శివసింగ్ ఋతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ విధ్వంసానికి బలి అయ్యాడు అని చెప్పాలి. ఇక వరుసగా ఏడు సిక్సర్లు కొట్టడంతో ఒకేఒవర్లో 42 పరుగులు ఇచ్చి చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో 58 పరుగులు తేడాతో గెలిచిన మహారాష్ట్ర జట్టు సెమీఫైనల్ లో అడుగుపెట్టింది.