
అయితే ఈ సినిమాలో కనిపించే నటీనటులు అందరూ కూడా అటు తమిళ ఇండస్ట్రీకి చెందిన వారే ఉండడం గమనార్హం. ఇక తెలుగు వారు ఎవరూ లేరు అని చెప్పాలి. అయినప్పటికీ ఇక కథ బాగుంటే ఎవరూ చేసినా కూడా ప్రేక్షకులు ఆస్వాదిస్తారు అన్నదాన్ని ఇక ఈ సినిమా నిరూపించింది అని చెప్పాలి. అయితే ఈ సినిమా కథ ఎక్కడిది ఎలా వచ్చింది అన్న విషయాన్ని ఇక ఈ సినిమాలో తెలుగు నటులను ఎందుకు తీసుకోలేదు అన్న విషయాన్ని కూడా డైరెక్టర్ హను రాఘవపూడి ఇటీవల వెల్లడించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
నాకు పుస్తకాలు చదవడం తెగ ఆసక్తి.. ఇక ఓ రోజు కోఠిలో సెకండ్ హ్యాండ్ పుస్తకం కొన్నాను. అందులో ఒక లెటర్ ఉంది. అది ఓపెన్ చేసి కూడా లేదు. హాస్టల్లో ఉంటున్న అబ్బాయికి వాళ్ళ అమ్మ రాసిన లెటర్ అది. సెలవులకు రమ్మని ఆమె రాస్తే అది చదివాక నాకు ఆలోచన వచ్చింది. లెటర్ లో ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే అనే ఒక లైన్ తట్టింది. ఇక ఆ లైన్ తోనే సీతారామం సినిమా స్టోరీ పుట్టింది. ఇక ఈ సినిమా స్టోరీని నిర్మాత స్వప్న గారికి చెబితే వెంటనే ఓకే అన్నారు. ఈ సినిమాలో హీరోగా దుల్కర్ సల్మాన్ బాగా సరిపోతాడని అనిపించింది అందుకే అతన్ని తీసుకున్న.
సీత పాత్ర కోసం పాత నటులు కాకుండా కొత్తవారు అయితే బాగుంటుందని అనుకున్నాను. అలాంటి సమయంలోనే నిర్మాత స్వప్న మృణాల్ ఠాగూర్ పేరును సూచించింది. ఇక ఆమెను పిలిచి టెస్ట్ కట్ చేస్తున్న సమయంలో ఆమె సీత పాత్రకు సరిగ్గా సరిపోతుందని అనుకున్నా. ఇక తెలుగు అమ్మాయిల ప్రొఫైల్స్ ఎక్కడ కనిపించలేదు. తెలుగు అమ్మాయి ఉందని తెలిస్తే పాత్రకు సరిపోతుందా లేదా అని చూడొచ్చు. కానీ ఎక్కడ తెలుగు ప్రొఫైల్స్ కనిపించలేదు. తెలుగు వాళ్ళు దొరికితే ఇంకా మాకే బెటర్. ఎందుకంటే వాళ్ళకి భాష కూడా వచ్చి ఉంటుంది అంటూ హను రాఘవపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.