గత కొంతకాలం నుంచి అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియాలో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ ఎంతల విమర్శలు ఎదుర్కొంటున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దూకుడైన ఆట తిరుగు కేరాఫ్ అడ్రస్ అయిన డేవిడ్ వార్నర్ ఎందుకో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక విమర్శల పాలు అవుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ పని అయిపోయిందని అతన్ని జడ్డు నుంచి పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసింది అంటూ ఎంతో మంది కాస్త ఘాటు వ్యాఖ్యలు చేయడం కూడా అభిమానులను ఎంతగానో ఆందోళనలో ముంచేసింది. అయితే డేవిడ్ వార్నర్ ఇక మరోసారి తన మునిపాటి ఫామ్ నిరూపించుకొని ఎన్నో రోజులు నిరీక్షణకు తెరదించుతూ  డబుల్ సెంచరీ తో చెలరేగిపోయాడు అన్న విషయం తెలిసిందే.


 కాగా ఇటీవల  ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టుతో ఆతిథ్య ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఆడుతూ ఉండగా దక్షిణాఫ్రికా తో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భాగంగా డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు డేవిడ్ వార్నర్. ఈ క్రమంలోనే ఎన్నో రోజులపాటు తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు అని చెప్పాలి. ఇక మైదానంలో బ్యాట్ తో ఎంతో వీరోచితంగా పోరాడిన డేవిడ్ వార్నర్ ఇక్కడ డబుల్ సెంచరీ తర్వాత రిటైర్డ్ హార్టుగా మైదానం వీడి వెళ్లిపోయాడు. ఇక ఇలా ఎన్నో రోజుల తర్వాత డేవిడ్ వార్నర్ బ్యాట్ నుంచి డబుల్ సెంచరీ రావడంతో అభిమానులందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి. కాగా ఇటీవలే బాక్సింగ్ డే టెస్టులో డబుల్ సెంచరీ చేయడంపై స్పందించిన డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 దక్షిణాఫ్రికా తో బాక్సింగ్ డే టెస్టులో డబుల్ సెంచరీ మార్కును అందుకోవడం ఒక మ్యాజికల్ మూమెంట్ అంటూ డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు. మంచి స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తానని ఇక మ్యాచ్ కి ముందు నా స్నేహితులతో చెప్పాను అంటూ గుర్తు చేసుకున్నాడు. అనుకున్నట్లుగానే ఏకంగా డబుల్ సెంచరీ చేయడం అద్భుతంగా ఉంది అంటూ తెలిపాడు.  ఇక కుటుంబ సభ్యులు స్నేహితుల ముందు డబుల్ సెంచరీ చేయడం మరింత గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు డేవిడ్ వార్నర్   దాదాపు గత 12 నెలలుగా ఈ స్కోరు సాధించలేకపోయాను అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: