
అయితే తెలుగులో మాత్రమే కాదు తమిళంలోనూ ఈ అమ్మడు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అని చెప్పాలి. అయితే సాధారణంగా హీరోయిన్లు కాస్త సీనియర్లుగా మారిన తర్వాత ఒకప్పుడు రొమాన్స్ చేసిన హీరోల పక్కనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం.. తర్వాత కాలంలో ఏకంగా హీరోలకు అమ్మ పాత్రల్లో కూడా నటించడం లాంటివి చూశాము. అయితే ఇక్కడ ఒక నటుడు మాత్రం ఏకంగా త్రిషతో ఫ్రెండ్ గా మామయ్యగా తండ్రిగా కూడా నటించాడట ఓక యాక్టర్. అతను ఎవరో కాదు ప్రకాష్ రాజ్. త్రిష తొలి తెలుగు మూవీ అయిన వర్షం, ఇక ఆ తర్వాత ఆకాశమంత రీసెంట్ గా వచ్చిన పోనియన్ సెల్వం సినిమాలో ప్రకాష్ రాజ్ త్రిష కు తండ్రిగా నటించారు.
సిద్ధార్థ హీరోగా తెరకెక్కిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో ప్రకాష్ రాజ్ త్రిషకు మామ పాత్రలో నటించాడు అన్న విషయం తెలిసిందే. అయితే మహేష్ బాబు నటించిన ఒక్కడు తమిళ రీమెక్ లో మాత్రం త్రిష బాయ్ ఫ్రెండ్ గా నటించాడు ప్రకాష్ రాజ్. ఇలా ఒక త్రిష పక్కనే బాయ్ ఫ్రెండ్ గా,తండ్రిగా, మామగా కూడా నటించి నిజంగా ప్రకాష్ రాజ్ వెర్సటైల్ యాక్టర్ అన్న విషయాన్ని నిరూపించుకున్నాడు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం త్రిష పోన్నియన్ సెల్వన్ 2 లో నటిస్తుంది అలాగే రాంగి సినిమాలో కూడా నటించింది.