2022 ఏడాది అటు విరాట్ కోహ్లీ ప్రేక్షకులకు మరిచిపోలేని క్రికెట్ క్యాలెండర్ అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే దాదాపు మూడేళ్ల నుంచి ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు విరాట్ కోహ్లీ. ఇక క్రికెట్ ప్రేక్షకులందరూ కోరుకున్న సెంచరీకి కూడా ఎంతో దూరం వచ్చేసాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ వస్తుందా లేదా అని అభిమానులు అందరూ నిరీక్షణగా ఎదురుచూస్తున్న సమయంలో అటు ఆసియా కప్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో టి20 ఫార్మాట్లో తన మొదటి సెంచరీ నమోదు చేశాడు.


 తద్వారా సెంచరీ నిరీక్షణకు తెరదింపాడు. ఇక ఆ తర్వాత టెస్ట్ ఫార్మాట్లో వన్డే ఫార్మాట్లో కూడా అద్భుతమైన సెంచరీలతో ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టి20 వరల్డ్ కప్ లో భాగంగా విరాట్ కోహ్లీ చేసిన ప్రదర్శన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఇకపోతే ఇటీవల విరాట్ ప్రదర్శనపై సీనియర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ ప్రశంసలు కురిపించాడు. టి20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ఇక ఈ ఏడాది అత్యుత్తమమైన ఇన్నింగ్స్ అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇక ఈ ఏడాది మూడు ఫార్మట్ లలో ఏ ఆటగాడు అత్యుత్తమ ప్రదర్శన చేశాడు అన్న విషయాన్ని కూడా ప్రస్తావించాడు.
 అటు టెస్ట్ ఫార్మాట్లో రిషబ్ పంత్ అత్యుత్తమ ఆటగాడని.. ఇక టి20 ఫార్మాట్లో మిస్టర్ 360 ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ కే నా ఓటు అంటూ దినేష్ కార్తీక్ తెలిపాడు. సూర్య కుమార్ యాదవ్ కేవలం దేశం తరఫున మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ అంటూ తెలిపాడు. ఇక వన్డే ఫార్మాట్లో అత్యంత నిలకడగా ఆడిన బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే జట్టు పరంగా ఈ ఏడాది గొప్పగా ఆడలేక పోయాము. వన్డేల్లో బలమైన జట్టుతో బరిలోకి దిగలేదని చెప్పగలను. టి20  ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకొని ఇక పొట్టి ఫార్మాట్ జట్టుకే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చాం అంటూ చెప్పుకొచ్చాడు దినేష్ కార్తీక్.

మరింత సమాచారం తెలుసుకోండి: