
ఈ క్రమంలోనే ముంబైలోని కోకిల బెన్ ఆసుపత్రిలో ప్రత్యేకమైన వైద్య బృందం సమక్షంలో పంత్ చికిత్స పొందుతున్నాడు. అతని మోకాలికి శస్త్ర చికిత్స జరిగినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇక అతను త్వరగా కోలుకుంటున్నాడు అని బీసీసీఐ వర్గాలు చెప్పడంతో అటు అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే ఇటీవల రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి అటు వైద్యులు అభిమానులందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పారు. ఈ వారంలో రిషబ్ పంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఈ విషయంపై బీసీసీఐ కూడా క్లారిటీ ఇచ్చింది.
రిషబ్ పంత్ వేగంగా కోరుకుంటున్నాడు. ఇక ఇటీవల వైద్య బృందం కూడా శుభవార్త చెప్పింది. రిషబ్ పంత్ మొదటి సర్జరీ విజయవంతంగా పూర్తయింది. మరో వారంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతాడని వైద్యులు తెలిపారు అంటూ బీసీసీఐ అధికారి ఒకరు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు డిశ్చార్జ్ అయినప్పటికీ మళ్ళీ వచ్చే నెలలో వంత్ హాస్పిటల్కు వెళ్లాల్సి ఉందట. ఎందుకంటే అతనికి మరో సర్జరీ అవసరమని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఇక మరో నెలలో ఆ సర్జరీని చేయబోతున్నారట వైద్యులు. ఎప్పుడు చేస్తారు అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. అయితే బీసీసీఐ వైద్య బృందం మాత్రం అటు కోకిల బెన్ ఆస్పత్రి వైద్యులతో నిరంతరం టచ్ లో ఉంటున్నారట.