భారత జట్టులో టెస్ట్ ఫార్మాట్లో యువ క్రికెటర్ల హవా నడుస్తున్న వేళ టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా పేరు సంపాదించుకున్న పూజార పేలవమైన ఫామ్ లో ఉండడంతో పూర్తిగా జట్టుకు దూరమైపోయాడు అన్న విషయం తెలిసిందే. దీంతో అతని కెరియర్ ముగిసిపోయింది అని అందరూ భావించారు. ఇలాంటి సమయంలోనే నిరాశపడకుండా ఇంగ్లాండ్ కౌంటి క్రికెట్లో ఆడి మునుపటి ఫామ్ ను అందుకున్నాడు.  అంతేకాకుండా రెగ్యులర్ ఆట తీరును కూడా మార్పు చేసుకున్నాడు. ఆచీతూచి ఆడటం కాదు మెరుపు ఇన్నింగ్స్ లు ఆడి తనలో ఇంకా టాలెంట్ దాగి ఉంది అన్న విషయాన్ని భారత సెలెక్టర్లకు నిరూపించాడు అని చెప్పాలి.


 ఇక ఆ తర్వాత భారత జట్టులోకి వచ్చి బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఏకంగా ఎన్నో రోజులుగా అభిమానులు ఎదురుచూస్తున్న సెంచరీ తో కదం తొక్కాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా తో జరుగుతున్న నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లోను జట్టులో భాగం అయ్యాడు చటేశ్వర్ పూజార. ఈ క్రమంలోనే ఇక జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే ఇప్పటికే మొదటి మ్యాచ్ ముగించుకున్న టీమిండియా ఢిల్లీ వేదికగా రేపు రెండవ టెస్ట్ మ్యాచ్ ఆడబోతుంది. అయితే ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ ద్వారా తన కెరీర్ లో 100 టెస్ట్ మ్యాచ్ మైలురాయిని అందుకోబోతున్నాడు పూజార.


 ఇటీవలే మీడియా సమావేశంలో పాల్గొన్న పూజార.. తన కెరియర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  అదే సమయంలో ఇక మీ డ్రీమ్ ఏంటి అని రిపోర్టర్లు ప్రశ్నించుగా.. తన మనసులో మాట బయటపెట్టాడు అని చెప్పాలి. తాను 100 టెస్టుల మైలురాయికి చేరుకోవడంలో మా నాన్న చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఇక 100వ టెస్టు మ్యాచ్ చూసేందుకు ఆయన స్టేడియంకి వస్తారు. మద్దతుగా నిలిచిన కుటుంబానికి రుణపడి ఉంటా అంటూ చెప్పుకొచ్చాడు.. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఇండియాను గెలిపించి కప్ అందించడమే తన కల అంటూ చెప్పుకొచ్చాడు చతేశ్వర్ పూజారా. కాగా ప్రస్తుతం పాయింట్లు పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతున్న భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టడం ఖాయం గానే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: