కెరియర్ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా  టీమిండియాలోకి వచ్చిన దినేష్ కార్తీక్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు అని చెప్పాలి. అప్పటివరకు టీమిండియా తరఫున అంతంత మాత్రం అవకాశాలు అందుకున్న దినేష్ కార్తీక్ 2022 ఏడాదిలో జరిగిన ఐపీఎల్ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన చేయడం ద్వారా ఇక అతను భారత జట్టులోకి తనను సెలెక్ట్ చేయడం తప్పనిసరి అనే ఒత్తిడిని సెలెక్టర్లపై తీసుకువచ్చాడు. అంతేకాదు టీమ్ ఇండియాను ఎన్నో రోజుల నుంచి వేధిస్తున్న ఫినిషిర్ పాత్రకు తానే సరైన ఆటగాడిని అని నిరూపించాడు దినేష్ కార్తీక్.


 ఇక తన మెరుపు బ్యాటింగ్తో దినేష్ కార్తీక్ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఆశ్చర్యపరిచాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఎంతో మంది యువ ఆటగాళ్ళు సత్తా చాటుతూ ఉన్నప్పటికీ సీనియర్ ప్లేయర్ అయిన దినేష్ కార్తీక్ కే ఇక టి20 వరల్డ్ కప్ జట్టులో కూడా స్థానం కల్పించేలా తన ఆటతీరుతో ప్రభావితం చేశాడు. అయితే ఇలా ఎన్నో అంచనాల మధ్య వరల్డ్ కప్ లో అవకాశం దక్కించుకున్న దినేష్ కార్తీక్ అటు వరల్డ్ కప్ లో మాత్రం అంచనాలకు తగ్గట్లుగా ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో ఇక సెలక్టర్లు అతన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు టీమ్ ఇండియా ఆడుతున్న మ్యాచ్లకు సంబంధించిన రివ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ వార్తలు నిలుస్తూ ఉన్నాడు దినేష్ కార్తీక్. ఇకపోతే ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆస్క్ డీకే అనే ఒక చిట్ చాట్ సెషన్ నిర్వహించాడు. ఈ క్రమంలోనే అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు అని చెప్పాలి. ఇక నేటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. కాగా ఇందులో ఒక నేటిజెన్ స్మిత్ సెంచరీ చేయకుండా ఆపేది ఎవరు అంటూ ప్రశ్నించగా.. జడేజా అతనికి పెద్ద సవాలుగా మారుతాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మీ ఫేవరెట్ బ్యాటింగ్ పార్ట్నర్ ఎవరు అని అడగ్గా.. ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా పేరు చెప్పాడు దినేష్ కార్తీక్..

మరింత సమాచారం తెలుసుకోండి: