ప్రపంచ క్రికెట్లో రికార్డుల రారాజుగా కొనసాగుతున్న ఆటగాడు ఎవరు అంటే ప్రతి ఒక్క క్రికెట్ ప్రేక్షకుడు టక్కున చెప్పేస్తారు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అని. ఎందుకంటే ఇప్పుడు వరకు వరల్డ్ క్రికెట్లో అతను సృష్టించిన రికార్డులు అలాంటివి. ఎంతోమంది లెజెండరీ క్రికెటర్స్ సృష్టించిన రికార్డులను బద్దలు కొట్టి తన పేరును లికించుచుకున్నాడు విరాట్ కోహ్లీ. అంతేకాదు మంచినీళ్లు తాగినంత ఈజీగా వరల్డ్ రికార్డులను బ్రేక్ చేసి తనకు తిరుగులేదు అని నిరూపించాడు. ఇలా భారత జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే తాను అందరిలా వచ్చి పోయే ఆటగాడిని కాదు చరిత్రలో నిలిచిపోయే ఆటగాడిని అన్న విషయాన్ని తన ఆట తీరుతోనే నిరూపించాడు.


 ఎన్ని పరుగులు చేసిన ఇంకా దాహం తీరలేదు అన్నట్లుగానే ప్రతి మ్యాచ్ లో కూడా ఇంకా ఏదో కొత్తగా నిరూపించుకోవాలనే కొత్త ఆటగాడిలాగా కనిపిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. ఇలాంటి స్వభావమే అందరిలో కెల్లా అతని ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టింది అని చెప్పాలి. అయితే గత మూడేళ్ల పాటు సరైన ప్రదర్శన చేయలేక ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ.. గడ్డు పరిస్థితుల నుంచి బయటపడి మరోసారి అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ ఉన్నాడు. తద్వారా మళ్ళీ ప్రపంచ రికార్డుల వేట ప్రారంభించాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో చేర్ చేసుకున్నాడు.


 ఆస్ట్రేలియా తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్లో ఒక అరుదైన మహిళలు రాయిని అందుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 25 వేల ఇంటర్నేషనల్ పరుగుల మార్కును అందుకున్నాడు. అయితే అందరినీ వెనక్కినట్టే అత్యంత వేగంగా ఇక ఈ మైలురాయిని అందుకున్న ఆటగాడిగా నిలిచాడు కోహ్లీ. 492 మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు రన్ మిషన్. అతనికంటే ముందు సచిన్ టెండూల్కర్ 664 మ్యాచులు, రికీ పాంటింగ్ 560, మ్యాచ్లు కల్లీస్ 519, కుమార సంగకర 594, జయవర్తనే 654 మ్యాచ్ లలో 25 వేల పరుగుల మార్కును అందుకున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: