ఎన్నో ఏళ్లపాటు భారత జట్టులో చోటు దక్కుతుందేమో అని ఆశగా ఎదురు చూసాడు తెలుగు క్రికెటర్ వైజాగ్ కుర్రాడు కె.ఎస్ భరత్. అయితే పలుమార్లు అతనికి భారత జట్టుల్లో చోటు దక్కినప్పటికీ  ఇక తుది జట్టులోకి వచ్చి మైదానంలోకి దిగే అవకాశం మాత్రం రాలేదు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవలే రిషబ్ పంత్ గాయం బారిన పడిన నేపథ్యంలో ఇక కె.ఎస్ భరత్ కు అటు టీమిండియా తరఫున వికెట్ కీపింగ్ చేసే అవకాశం దక్కింది. ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర ట్రోఫీలో భారత జట్టులో అతను భాగం అయ్యాడు అన్న విషయం తెలిసిందే.


 ఇలా కేఎస్ భరత్ భారత జట్టులోకి రావడం పై అటు తెలుగు ప్రేక్షకులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఏకంగా అతనికి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. అయితే ఇక కీపింగ్ నైపుణ్యాలతో అతను రోహిత్ శర్మ నుంచి ప్రశంసలు కూడా అందుకుంటున్నాడు. ముఖ్యంగా డిఆర్ఎస్ విషయంలో రోహిత్ తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా.. రోహిత్ ను భరత్ ప్రభావితం చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కేఎస్ భరత్ ఇక రెండో మ్యాచ్ లో మాత్రం పరవాలేదు అనిపించాడు. అయితే మూడో టెస్ట్ మ్యాచ్లో మాత్రం అటు భారత జట్టులో కేఎస్ భరత్ కు ప్రమోషన్ రాబోతుంది అన్న టాక్ తెలుగు అభిమానులు అందరినీ కూడా ఆకర్షిస్తుంది.


 గత రెండు మ్యాచ్ లలో  కూడా ఓపెనర్ గా బరిలోకి దిగిన సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు అన్న విషయం తెలిసిందే. అయితే అతన్ని వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించారు. జట్టు నుంచి కూడా తప్పించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ కేఎల్ రాహుల్ ని అటు జట్టు నుంచి తప్పిస్తే రోహిత్ శర్మతో పాటు తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్ ఇన్నింగ్స్ ని ప్రారంభించే అవకాశం ఉంది అని ఒక టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక నిజంగానే భరత్ కు ప్రమోషన్ తో తెలుగు ప్రేక్షకులు ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: