బోర్డర్ గవాస్కర్  ట్రోఫీలో భాగంగా టీమ్ ఇండియా జట్టు ఆస్ట్రేలియా తో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లలో భాగంగా టీమిండియా మొదటి రెండు మ్యాచ్లలో పూర్తి ఆధిపత్యం చాలా ఇంచింది అని చెప్పాలి. ఇక వరుసగా విజయాలు సాధిస్తూ పటిష్టమైన ఆస్ట్రేలియకు ఊహించని షాక్ లు ఇచ్చింది. మొదటి మ్యాచ్ లో 132 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకున్న టీమిండియా ఇక రెండవ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.


 టీమిండియా జోరు చూస్తే అటు ఆస్ట్రేలియాను నాలుగు మ్యాచ్లలో కూడా ఓడించి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని అందరూ భావించారు అని చెప్పాలి. కానీ ఊహించని రీతిలో ఇండోర్ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్లో మాత్రం టీమ్ ఇండియా తడబడింది అన్న విషయం తెలిసిందే. అప్పటికే రెండు మ్యాచ్లలో ఓడిపోయి మూడో మ్యాచ్ గెలవాలన్న కసితో ఉన్న ఆస్ట్రేలియా తమ అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఏకంగా భారత పిచ్ ల పైనే టీమ్ ఇండియా జట్టుకు చుక్కలు చూపించింది అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు.


 చివరికి ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు 9 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో మూడవ టెస్ట్ ఓటమిపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో మా బ్యాటింగ్ అస్సలు బాగాలేదు. ఎక్కువ రన్స్ చేయడం ఎంత ముఖ్యమో బాగా అర్థం చేసుకున్నాము ఆస్ట్రేలియాకు ఆతఖ్యం లభించినప్పటికీ కూడా రెండవ ఇన్నింగ్స్ లో మళ్లీ పుంజుకోలేకపోయాం. తొలి ఇన్నింగ్స్ లో బాగా ఆడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. మనం సరిగా ఆడితే పిచ్ తో సంబంధం లేకుండా ఫలితాలు అవే వస్తాయి అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: