టీమిండియా యువ సంచలనం శుభమన్ గిల్ గత కొంతకాలం నుంచి అత్యుత్తమమైన ఫామ్ లో కొనసాగుతూ వస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఫార్మాట్ తో సంబంధం లేకుండా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ఇక మంచి ఇన్నింగ్స్ ఆడుతూ టీమ్ ఇండియాలో తన స్థానాన్ని సుస్థిరం  చేసుకుంటున్నాడు అని చెప్పాలి. ఓపెనర్గా బరిలోకి దిగుతూ భారత్కు మంచి ఆరంభాలు అందిస్తూ ఉన్నాడు. దీంతో టీమిండియా ఏ ఫార్మాట్లో మ్యాచ్ ఆడినా కూడా అందులో తుది జట్టులో శుభమన్ గిల్ ఉండడం ఖాయంగా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి.


 అయితే ఇక పాతికేళ్ల వయసు కూడా నిండకముందే తన ఇన్నింగ్స్ లతో ఎన్నో ప్రపంచ రికార్డులను కొల్లగొడుతున్నాడు శుభమన్ గిల్. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో కూడా తన రికార్డుల వేట ప్రారంభిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఐపిఎల్ లో ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టు తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు ఈ యువ ఆటగాడు. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేస్తూ జట్టు విషయంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే కోల్కతాతో జరిగిన మ్యాచ్లో శుభమన్ గిల్ ఒక అరుదైన మైలురాయిని  అధిగమించాడు.


 ఐపీఎల్ హిస్టరీలో 2000 పరుగులు చేసిన రెండో అతి చిన్న వయస్కుడిగా నిలిచాడు శుభమన్ గిల్. అంతకుముందు రిషబ్ పంత్ 23 ఏళ్ల 27 రోజుల వయసులో 2000 పరుగుల  మైలురాయిని అందుకోగ.. ఇక ఇప్పుడు శుభమన్ గిల్ 23 ఏళ్ల 214 రోజుల్లో ఈ ఘనత సాధించాడు అని చెప్పాలి. వీరి తర్వాత సంజు  24 ఏళ్ల 140 రోజులు.. విరాట్ కోహ్లీ 24 ఏళ్ల 175 రోజులు  సురేష్ రైనా 25 ఏళ్ల 199వయసులో ఐపీఎల్ లో 2000 పరుగుల మార్క్ అందుకున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: