ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ లో కూడా ప్రేక్షకుల ఊహకందని ఫలితం వస్తుంది అనే విషయం తెలిసిందే. దీంతో ఏ మ్యాచ్ లో ఎవరు విజేతగా నిలుస్తారు అనే విషయంపై ముందుగా ఒక అంచనాకు రాలేకపోతున్నారు ప్రేక్షకులు. విశ్లేషకులు సైతం ఈ విషయంలో కన్ఫ్యూజన్లో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఎప్పుడు ఎవరు బాగా రాణిస్తారు.. ఏ టీం గెలుస్తుంది అన్నది కూడా ఊహకందన విధంగానే మారిపోయింది.



 ఇప్పటివరకు ఎన్నో మ్యాచ్ లలో గెలుస్తుంది అనుకున్న టీమ్ ఓడిపోవడం.. ఓడిపోతుంది అనుకున్న టీం గెలవడం జరిగింది. దీంతో ప్రతి మ్యాచ్ ని చూస్తూ ఎంజాయ్ చేయడం తప్ప ఏ జట్టు గెలుస్తుంది అని అంచనా వేయడం లేదు ప్రేక్షకులు. ఇకపోతే ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్  రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటి తరహా ఫలితమే వెలువడింది. ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. వరుస విజయాలు సాధిస్తూ అదరగొడుతుంది. అలాంటి రాజస్థాన్ జట్టు ఇటీవల బెంగళూరు చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది.



 ఏకంగా 112 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది. ఐపీఎల్ లో మూడో అత్యంత స్కోరు నమోదు చేసి చెత్త రికార్డును మూటగట్టుకుంది రాజస్థాన్ జట్టు. అయితే ఇక రెండో అత్యల్ప స్కోర్ 58 కూడా అటు రాజస్థాన్ పేరు మీదే ఉండడం గమనార్హం. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 10.3 ఓవర్లలో 59 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే ఐపీఎల్ లో మూడో అత్యల్ప స్కోర్ అమలు చేయడంపై స్పందించిన రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఓటమి గురించి మాట్లాడడానికి నా దగ్గర సమాధానం లేదు అంటూ కెప్టెన్ సంజూ తెలిపాడు. డగౌట్  లో కూర్చొని తాము ఎక్కడ తప్పు చేసామని ఆలోచించానని చెప్పుకొచ్చాడు సంజూ శాంసన్.

మరింత సమాచారం తెలుసుకోండి: