2023 ఐపీఎల్ సీజన్ ఎంతో రసవత్తరంగా సాగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ పోరులో అటు చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ ను ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది. అయితే ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్ విజేతగా ఉంది.. ఇక ఐపీఎల్ 16వ సీజన్లో కూడా టైటిల్ నెగ్గడంతో ఐదు సార్లు గెలిచినట్లు అయింది. అయితే ఇక ఇప్పటివరకు అటు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ హిస్టరీలో అత్యధికసార్లు టైటిల్ గెలిచిన జట్టుగా ఉండగా.. ఇక ఐపీఎల్ సీజన్ లో టైటిల్ గెలవడం ద్వారా అటు చెన్నై సూపర్ కింగ్స్ ఈ రికార్డును సమం చేసింది అని చెప్పాలి.



 అయితే అటు ముంబై ఇండియన్స్ ఐదు సార్లు టైటిల్ కలిసినప్పుడు అటు రోహిత్ కెప్టెన్ గా ఉన్నాడు.  చెన్నై సూపర్ కింగ్స్ ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచినప్పుడు కూడా కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. దీంతో ఇక వీరిద్దరూ ఆటగాళ్ళు ఐపీఎల్లో ఎక్కువ టైటిల్స్ గెలిచిన ప్లేయర్స్ అని అందరూ అనుకుంటారు. కానీ   అలా అనుకున్నారంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే   చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని దాటిసి ఎక్కువ టైటిల్స్ గెలిచిన ప్లేయర్గా ఒక ఆటగాడు కొనసాగుతున్నాడు.


 అతను ఎవరో కాదు తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు. అంబటి రాయుడు ఏంటి ధోని కంటే ఎక్కువ టైటిల్స్ గెలవడం ఏంటి అని షాక్ అవుతున్నారు కదా. ధోని  ఐదుసార్లు టైటిల్ గెలిస్తే అంబటి రాయుడు మాత్రం ఏకంగా ఆరుసార్లు ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు.  ముంబై ఇండియన్స్ జట్టులో ఆడినప్పుడు మూడుసార్లు టైటిల్ గెలిచిన ప్లేయర్గా ఉన్న అంబటి రాయుడు..  సూపర్ కింగ్స్ తరఫున మూడుసార్లు ఐపీఎల్ ట్రోపీ నెగ్గాడు. ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐదు సార్లు టైటిల్ నెగ్గితే రాయుడు ధోనినే దాటేశాడు అంబటి రాయుడు. అయితే రోహిత్ అయిదు సార్లు ముంబై తరఫున ఒకసారి దక్కన్ చార్జెస్ తరఫున మొత్తం ఆరుసార్లు టైటిల్ నెగ్గిన ప్లేయర్ గా ఉన్నాడు. కోహ్లీ ఒక్కసారి కూడా టైటిల్ గెలిచినా టీమ్ లో లేడు.

మరింత సమాచారం తెలుసుకోండి: