అవును పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాలి తీసేశాడు. పార్టీ తరపున గెలిచిన ఎంఎల్ఏనే జనసేనను, అధినేత పవన్ను గుర్తించటానికి ఇష్టపడలేదు. గెలిచింది జనసేన తరపునే అయినా తాను మాత్రం మొదటినుండి కాంగ్రెస్ నేతనే అంటూ బల్లగుద్దకుండానే చెప్పాడు లేండి. ప్రస్తుతానికైతే తాను వైసిపి సభ్యుడిగానే తిరుగుతున్నట్లు కూడా చెప్పేశాడు. పార్టీలో మూడు గ్రూపులున్న కారణంగా తాను అధికారికంగా వైసిపిలో చేరలేదన్నాడు. జగన్మోహన్ రెడ్డి కలిపించుకుని గ్రూపులను సెట్ చేస్తే వెంటనే తాను వైసిపిలోకి వచ్చేస్తానని కూడా నేతలు, కార్యకర్తలకు హామీ ఇచ్చాడు. వైసిపి నుండి రాజోలు నియోజకవర్గంలో పోటి చేసే అవకాశం రానికారణంగానే చివరి నిముషంలో రాపాక జనసేనలో చేరి టికెట్ తీసుకుని పోటి చేసి గెలిచిన విషయం అందరికీ తెలిసిందే.
రాపాక గెలవటం, వైసిపి కూడా బంపర్ మెజారిటితో అధికారంలోకి రావటంతో రాపాక అనధికారికంగా అధికారపార్టీ ఎంఎల్ఏగానే తిరిగేస్తున్నాడు. ఇదే విషయాన్ని పవన్ను మీడియా అడిగినపుడు ’ఎంఎల్ఏ రాపాక ఏ పార్టీలో ఉన్నాడే ఆయన్నే అడగండి’ అంటూ ఇచ్చిన సమాధానం అందరికీ గుర్తుండే ఉంటుంది. గెలిచిన దగ్గర నుండి రాపాకకు పవన్ కూడా పెద్దగా ప్రాముఖ్యత ఇచ్చింది లేదు. పార్టీ తరపున నియమించిన అన్నీ కమిటీల్లో రాపాకను సభ్యునిగా నియమించలేదు. గెలిచిన ఏకైక ఎంఎల్ఏ రాపాకనే కాబట్టి ప్రతి కమిటిలోను సభ్యునిగా నియమిస్తే ఆయనకు కూడా గౌరవంగా ఉండేది. అలాకాకుండా ఓడిపోయిన వాళ్ళని సొంత బలంతో గెలవలేని నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళని ఛైర్మన్ గా నియమించటమే పవన్ తలతిక్కతనం.
పవన్ చేసిన పనికి ఎంఎల్ఏ రాపాకకు కూడా కచ్చితంగా మండిపోయుంటుంది. గెలిచిన తనను కాదని ఓడిపోయిన వాళ్ళకు, అసలు గెలవలేని వాళ్ళని ఛైర్మన్లుగా కమిటిలకు నియమిస్తే ఎవరికైనా మండుతుంది. దాంతో రాపాక కూడా పార్టీతో పాటు పవన్ కు కూడా దూరంగానే తిరుగుతున్నాడు. పవన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించేటపుడు కూడా ఎంఎల్ఏ ఎక్కడా కనబడటం లేదు. దాంతో మానసికంగా ఎంఎల్ఏ పార్టీకి దూరమైపోయిట్లే అని ఎప్పుడో అర్ధమైపోయింది. అసెంబ్లీలోను బయట కూడా అధికారపార్టీ తీసుకునే నిర్ణయాలకు రాపాక బహిరంగంగానే మద్దతు పలికేస్తున్నాడు. ఒకవైపు జగన్ నిర్ణయాలను పవన్ వ్యతిరేకిస్తుంటే సొంతపార్టీ ఎంఎల్ఏ మద్దతు పలుకుతుండటం అధినేతకు కూడా తలనొప్పులే అనటంలో సందేహం లేదు. కానీ చేసేదేముంది ? ఎలాగూ కంట్రోల్ చేయలేడు కాబట్టే పూర్తిగా వదిలిపెట్టేశాడు.
అందుకనే తాజాగా రాజోలులో జరిగిన ఓ సమావేశంలో రాపాక మాట్లాడుతూ పార్టీ గాలి తీసేశాడు. ఎప్పుడో ఒకపుడు జనసేన గాలికి కొట్టుకుపోయే పార్టీయే అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. పోటి చేసిన రెండు నియోజకవర్గాల్లోను పవన్ ఓడిపోయాడని ఎంఎల్ఏ చెప్పినపుడు మీటింగులో ఉన్నవాళ్ళ విజిల్స్ వేయటమే విచిత్రంగా ఉంది. నిజానికి రాపాక గనుక వైసిపిలో చేరిపోదలచుకుంటే సాంకేతికంగా అడ్డుకూడా లేదు. ఉన్నదే ఒక్కడు కాబట్టి వైసిపిలో చేరిపోతే నియమ, నిబంధనలు కూడా అడ్డుకోలేవు. అయినా రాపాక ఆపని చేయకుండా వెయిట్ చేస్తున్నాడు. బహుశా నియోజకవర్గంలో గొడవల విషయంలో జగన్ కలిపించుకుని సెట్ చేసిన తర్వాత పార్టీలో చేరుదామని అనుకున్నాడేమో ? చూద్దాం రాపాక ఇంకెన్ని సంచలనాలు రేకెత్తిస్తాడో ?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి