
పరుగులు పెట్టేస్తున్నారు. సైకిల్ దూకి మరి వెళ్లిపోతున్నారు. అసలు నా పార్టీ ఇయర్చ్ రాజకీయ జీవితంలో ఇన్ని కష్టాలు ఎప్పుడూ పడలేదమ్మా ! అసలు ఫ్యాను పార్టీ ఓనరు ఉన్నాడే అందరినీ ముసి ముసి నవ్వులు నవ్వుతూ పిలిచేస్తున్నాడు. అచలే మన మీద పీకల్లోతు కోపం లో ఉండి ఎప్పుడు గోడ దూకుదామా అని చూస్తున్న వారంతా ఇప్పుడు మెల్లి మెల్లిగా వెళ్లిపోతున్నారు. అసలు నేను పిలిచి జో కొట్టినా నో నో అనేస్తున్నారు. వామ్మో వాయ్యో మీరు సైకిల్ ను మాలోకం చేతిలో పెట్టేస్తారు మాకు తెలిసి అంటూ పరుగులు పెట్టేస్తున్నారు. ఏంటి అంతగా ఈళ్లను బయపెట్టేశావేంటి ? అచలు నా ముందే వాళ్ళందరూ తమాచాలు, పిచ్చకథలు చేస్తారా ? వాళ్ళ సంగతి నేను చూస్తాను.
ఎప్పుడో ఆళ్ల పార్టీ వాళ్ళని లాగేసుకున్నాననే కోపంతో ఇప్పుడు మా చైకిల్ మీద నుంచి లాక్కుని మరీ ఎత్తుకుపోతారా ? ఇంత మోచామా ? అసలు మోచాలు చేయాలంటే నేను చేయాలి కానీ ఇంకెవరన్నా చెత్తే నేను ఊరుకుంటానా ఏంటి ? అది చర్లేండి నాన్నారు ఇప్పుడు మన పార్టీవోల్లు జుంపింగ్ లు చేసి ఫ్యాను కిందకి వెళ్లి హమ్మయ్యా ..! అని గాలి పీల్చేత్తున్నారు కదా మనం కూడా ఆ ఫ్యాను కిందకి వెళ్లి పోదామా ? ఓచారి ఆ ఫ్యాను పార్టీ ఓనర్ని అడగండి నాన్నారు మేము మీ ఫ్యాను కిందకి వచ్చేత్తామ్..! మా చైకిల్ మూలానపడేత్తామ్ అని.