కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పార్టీని ఎక్కువగా ఇబ్బంది పెట్టడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాళ్ల విషయంలో సీరియస్ గానే ఉన్నారు. ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య గొడవలు వైసీపీని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. చాలామంది కీలక నేతలు ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు రావడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి అనేక విధాలుగా దగ్గరకావాలని భావిస్తున్నది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీ విషయంలో చాలా వరకు తెలుగుదేశం పార్టీ జాగ్రత్తగా ఉండాలని ఎలా అంటున్నారో...

తెలుగుదేశం పార్టీ విషయంలో వైసీపీ అంతకుమించి జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి తప్పులు జరగకుండా ముఖ్యమంత్రి జగన్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్నో తప్పులు చేయడంతో ఇప్పుడు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. రాజకీయంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైయస్ జగన్ కొన్ని కొన్ని అంశాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అయితే ఇప్పుడు నియోజకవర్గాల్లో పార్టీ ని ఇబ్బంది పెడుతున్న నేతల విషయంలో ఆయన చాలా వరకు కూడా సీరియస్ గా ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి.

 కొన్ని కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి పార్టీలో ఉన్న నేతల మధ్య సమన్వయం లేదు. ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా గుంటూరు జిల్లాలో అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా సమస్యలు కనపడుతున్నాయి. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ మధ్య కాలంలో కాస్త ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు అంటూ చింతలపూడి ఎమ్మెల్యే ఆరోపణలు ఎక్కువగా చేస్తున్నారు. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు విషయంలో కూడా దాదాపుగా ఇదే జరుగుతుంది. దీంతో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు ముఖ్యమంత్రి జగన్ త్వరలో పరిష్కారం చూపే అవకాశం ఉందని ఒక వేళ ఎవరైనా వెనక్కి తగ్గకపోతే మాత్రం ఆ నియోజకవర్గానికి ఇన్చార్జిని నియమించి ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: