నటుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రావు గోపాల్ రావు నటించిన ఎన్నో చిత్రాలకు గానూ 1990 సంవత్సరం లో కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్) ను ప్రధానం చేశారు. ఇంకా అనేక నాటక సంస్థలు ఈయనకు నట విరాట్ అనే బిరుదును కూడా అందించాయి. అంతేకాకుండా నంది అవార్డులు, చిత్తూరు నాగయ్య పేరుతో ఇచ్చే బహుమతులు, సితారా బహుమతులు కూడా అందుకున్నారు. 1984 నుండి 1985 వ సంవత్సరం లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా కూడా పనిచేశారు . ఇక రాజ్యసభ సభ్యుడిగా కూడా 1986 నుంచి 1992 వరకు పనిచేశారు. ఇక చివరిగా మధుమేహవ్యాధి ఎక్కువై, కిడ్నీలు చెడిపోవడంతో 1994 ఆగస్టు 13వ తేదీన స్వర్గస్తులయ్యారు.