
1919 నవంబరు 14వ తేదీన చెన్నైలో తొలి ‘అఖిలభారత పౌర గ్రంథాలయం’ను స్థాపించి, మొదటి మహాసభను నిర్వహించారు. ఆ రోజును 1968 నుండి ‘జాతీయ గ్రంథాలయ వారోత్సవ దినం’గా జరుపుకొంటున్నారు. 1934-48 మధ్యకాలంలో కోస్తాంధ్ర ప్రాంతంలో అనేక గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. 1972లో ‘పద్మశ్రీ పురస్కారం’ అందుకున్నారు. గ్రంథాలయ పితామహ, సరస్వతీ రమారమణ, గ్రంథాలయ విశారద వంటి బిరుదులు అందుకున్నారు. దేశంలో పూర్తిస్థాయిలో గ్రంథాలయాలను నెలకొల్పిన వ్యక్తిగా పేరు గడించిన ఈయన.. అనేక గ్రంథాలయ యాత్రలను నిర్వహించి, ‘ప్రజా గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం’ అని చాటి చెప్పారు. ఇలా ఈ విధంగా తన జీవితం మొత్తం గ్రంథాలయ ఉద్యమానికే కృషి చేసిన ఈయన.. 1979 మార్చ్ 7వ తేదీన పరమపదించారు.
1911లో విజయవాడలో రామమోహన గ్రంథాలయ స్థాపనకు తోడ్పడ్డారు. 1914లో విజయవాడలో ఆంధ్రదేశ గ్రంథ భాండాగార, ప్రతినిధుల గ్రంథాలయ మహాసభలు జరిపి భారతదేశంలో తొలిసారిగా గ్రంథాలయ సంఘాన్ని, 1915లో సంఘ పక్షాన ‘గ్రంథాలయ సర్వస్వం’ పత్రికను స్థాపించడానికి తోడ్పడ్డారు. 1919లో అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘాన్ని స్థాపించి, 1924లో ఆ సంఘ పక్షాన ‘ఇండియన్ లైబ్రరీ జర్నల్’ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించారు. 1934-1948 మధ్యకాలంలో గ్రంథాలయ యాత్రలను ఈయన నిర్వహించడంతోనే కొన్ని వందల సంఖ్యలో కొత్త గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. మూసివేసినవి పునరుద్ధరించబడ్డాయి.